BJP MP Candidates: జివిఎల్‌, కిరణ్ రెడ్డికి నిరాశేనా? ఎంపీ రేసులో పేర్లు గల్లంతు.. అభ్యర్థుల ఎంపికలపై అసంతృప్తి-gvl and kiran reddy names are missing in the ap mp race ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Gvl And Kiran Reddy Names Are Missing In The Ap Mp Race..

BJP MP Candidates: జివిఎల్‌, కిరణ్ రెడ్డికి నిరాశేనా? ఎంపీ రేసులో పేర్లు గల్లంతు.. అభ్యర్థుల ఎంపికలపై అసంతృప్తి

Sarath chandra.B HT Telugu
Mar 12, 2024 01:50 PM IST

BJP MP Candidates: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులు కొలిక్కి వచ్చిన వేళ కొందరు నేతలకు సీట్లు గల్లంతు కావడం చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లుగా విశాఖపై ఆశలు పెట్టుకున్న జివిఎల్‌తో పాటు మాజీ సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కూడా భంగపాటు తప్పేలా లేదు.

మూడు పార్టీల సీట్ల సర్దుబాటులో సీనియర్ల ఆశలపై నీళ్లు...
మూడు పార్టీల సీట్ల సర్దుబాటులో సీనియర్ల ఆశలపై నీళ్లు...

BJP MP Candidates: ఏపీలో ఐదేళ్ల తర్వాత కాషాయ జెండాను రెపరెపలాడించాలని భావిస్తున్న బీజేపీ.. టీడీపీ, జనసేనలతో జట్టు కట్టింది. ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై సీట్ల సర్దుబాటు కూడా కుదిరింది. కాస్త అటుఇటుగా అభ్యర్థుల ఎంపిక కూడా కొలిక్కి వచ్చింది. సోమవారం రాత్రి పొద్దుపోయాక సీట్ల సర్దుబాటును అధికారికంగా ప్రకటించారు. సీట్ల సర్దుబాటులో సీనియర్ల స్థానాలు గల్లంతయ్యాయి. 

ట్రెండింగ్ వార్తలు

ఏపీ ప్రజల ఆకాంక్షల మేరకు సీట్ల సర్దుబాటు జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌కు ఎన్నికల పొత్తులే గెలుపునకు పునాదులు అవుతాయన్నారు.

టీడీపీి 17 లోక్‌సభ, 144 అసెంబ్లీ సీట్లు పోటీ చేయనుంది. బీజేపీకి 6 లోక్‌సభ స్థానాలతో పాటు, 10 అసెంబ్లీ సీట్లు , జనసేన 2 లోక్‌సభ స్థానాలు, 21 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. నియోజకవర్గాలు, అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీలు ప్రకటించనున్నాయి.

ఏపీ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా 3 పార్టీల కూటమి వ్యవహరించనుందని చంద్రబాబు ప్రకటించారు. ఏపీ ప్రజలు ఎన్డీఏ పక్షాలకు అవకాశం కల్పించి ప్రజలకు సేవ చేసే అవకాశామివ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇప్పటికే 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. జనసేన కూడా ఐదారు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ప్రకటించింది. కాకినాడ లోక్‌సభకు పవన్ కళ్యాణ్, మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరి పేర్లు ఖరారు చేశారు.

అరకు, విజయనగరం, అనకాపల్లి ఎంపీ స్థానాల్లో కూడా పోటీ బిజెపి పోటీకి సిద్ధమైంది. రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి ఎంపీ స్థానాల్లో కూడా పోటీ చేయనుంది. రాజమహేంద్రవరం నుంచి పురందేశ్వరి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. నరసాపురం నుంచి రఘురామకృష్ణ రాజు పేరును ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

అరకులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, అనకాపల్లిలో సిఎం రమేష్, ఏలూరులో సుజనా చౌదరి పేర్లను ఖరారు చేయనున్నారు. మంగళవారం రెండో విడత లోక్ సభ అభ్యర్థుల జాబితాలో ఏపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులపేర్లు కూడా ఉండే అవకాశం ఉంది.ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు అసెంబ్లీ స్థానాల్లో బిజెపి పోటీ చేయనుంది. కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరు అసెంబ్లీ స్థానాల్లో కూడా బిజెపి పోటీ చేయనుంది.

వారిద్దరికి అవకాశం లేనట్టేనా…

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు జివిఎల్ GVL, మాజీ సిఎం కిరణ్ కుమార్‌ రెడ్డి Kiran Kumar Reddy పేర్లు తెరపైకి వచ్చాయి.

జివిఎల్‌ గత రెండేళ్లుగా విశాఖ నుంచి పోటీ చేసే లక్ష్యంతో ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడే మకాం వేసి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎన్నికల పొత్తులు కుదిరే సమయానికి ఆయన పేరు రేసులోనే లేకుండా పోయింది.

ఎన్నికల పొత్తులో మాజీ సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కూడా భంగపాటు తప్పలేదు. తెలంగాణ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కిరణ్ కుమార్‌ రెడ్డి అక్కడ ప్రచారంలో పాల్గొనడానికి కూడా తెలంగాణ నేతలు అంగీకరించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా పొత్తులో రాజంపేట నియోజక వర్గం మాయమైంది.

2019 ఎన్నికల తర్వాత టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో సుజనా చౌదరి Sujana, సిఎం రమేష్, టీజీ వెంకటేష్‌ TG Venkatesh బీజేపీలో చేరిపోయారు. తాజాగా వారిలో ఇద్దరికి టిక్కెట్లు ఖరారయ్యాయి. బీజేపీ పోటీ చేయనున్న ఆరు స్థానాల్లో ఒక్క చోట కూడా మొదటి నుంచి బీజేపీని నమ్ముకున్న నాయకులు లేరనే విమర్శ ఉంది. విజయనగరంలో పివిఎన్‌ మాధవ్‌ పేరు వినిపిస్తున్నా చివరి నిమిషం వరకు దానిపై గ్యారంటీ లేదు.

ఎన్నికల పొత్తులో సైతం తమకు నచ్చిన వారికే అభ్యర్థిత్వం దక్కేలా చంద్రబాబు చాతుర్యత ప్రదర్శించారని బీజేపీ నేతలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సీట్లలో కూడా పార్టీలు మారిన వారికే అవకాశం దక్కొచ్చని వాపోతున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం