Gorantla Buchchyya: టీడీపీ ఖాతాలో తొలి విజయం, గోరంట్ల బుచ్చయ్య గెలుపు
Gorantla Buchchyya: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం కొనసాగుతోంది. 144 స్థానాల్లో పోటి చేసిన టీడీపీ 133 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఓటమి ఖరారు కావడంతో టీడీపీ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగు తున్నారు.
Gorantla Buchchyya: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయ బావుటా ఎగుర వేస్తుండటంతో కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులు వెనుదిరుగు తున్నారు. టీడీపీ ఖాతాలో తొలి విజయం నమోదైంది. రాజమండ్రి రూరల్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50వేలకు పైగా మెజార్టీ సాధించారు.
రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఓటమి తప్పదని భావిస్తున్న వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
టీడీపీ కూటమి స్పష్టమైన మెజార్టీగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ కు కూడా అందనంత దూరంలో టీడీపీ కూటామికి భారీ మెజార్టీ వస్తుంది. టీడీపీ కూటమి 157 స్థానాల్లో మెజార్టీ కొనసాగుతుంది. టీడీపీ 131 జనసేన 19, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతున్నాయి.
మరోవైపు వైసీపీ చతికిలపడింది. గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచిన వైసీపీ, ప్రస్తుతం కేవలం 18 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతుంది. టీడీపీ కూటమి భారీ విజయం దిశగా అడుగులు వేయగా, వైసీపీ కూటమి భారీ ఓటమి దిశగా అడుగులు వేస్తుంది.
ఓటమి చెందుతామని అర్థమైన వైసీపీ నేతలు ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాద్ రెడ్డి, అలాగే రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు.
టీడీపీ తొలి విజయం
రాష్ట్రంలో టీడీపీ ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించింది. 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)