Case On Allu Arjun : నంద్యాలలో అల్లు అర్జున్ పై కేసు నమోదు - కారణం ఇదే...!-criminal case booked against actor allu arjun for election show at nandyal ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Case On Allu Arjun : నంద్యాలలో అల్లు అర్జున్ పై కేసు నమోదు - కారణం ఇదే...!

Case On Allu Arjun : నంద్యాలలో అల్లు అర్జున్ పై కేసు నమోదు - కారణం ఇదే...!

Maheshwaram Mahendra Chary HT Telugu
May 12, 2024 07:42 AM IST

Criminal Case On Actor Allu Arjun: హీరో అల్లు అర్జున్‌పై నంద్యాలలో కేసు నమోదైంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా నంద్యాలలో శనివారం ఆకస్మిక పర్యటన చేశారు. భారీగా జనం రావటంతో రోడన్ల్నీ కిక్కిరిసిపోయాయి. దీనిపై ఫిర్యాదు అందటంతో కేసు నమోదైంది.

నంద్యాలతో హీరో అల్లు అర్జున్
నంద్యాలతో హీరో అల్లు అర్జున్ (Twitter)

Case booked against Actor Allu Arjun : నంద్యాలలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా రవికి మద్దతుగా హీరో అల్లు అర్జున్ శనివారం ఆకస్మిక పర్యటన చేశారు. స్వయంగా శిల్పా రవి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ అభిమానులకు అభివాదం చేశాడు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అల్లు అర్జున్ నంద్యాలలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనగా… న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. అతనిపై నంద్యాల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అల్లు అర్జున్ రాకతో శిల్పా ఇంటి వద్దకు వేలాదిగా జనం తరలివచ్చారు. కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ అనుమతి తప్పనిసరి.

అల్లు అర్జున్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ పి.రామచంద్రరావు ఫిర్యాదు చేశారు. సెక్షన్‌ 144, పోలీసు 30 యాక్టు అమల్లో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో సమావేశమవడం ఎన్నికల ప్రోటోకాల్‌లను ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు నంద్యాల టు టౌన్ పోలీసులు శిల్పా రవితో పాటు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు.

గతంలోనూ అల్లు అర్జున్ మద్దతు….

నంద్యాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పారవి…. హీరో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డికి సన్నిహితుడు. దీంతో ఆయనకు మద్దతుగా నంద్యాలలో ఆకస్మిక పర్యటన చేశారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ రాకతో నంద్యాల పట్టణం కిక్కిరిసిపోయింది. అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. వేలాది మంది మద్దతుదారుల మధ్య అల్లు అర్జున, తన భార్య స్నేహారెడ్డితో కలిసి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.

బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున్న అక్కడికి చేరుకుని పుష్ప పుష్ప అంటూ నినాదాలు చేశారు. శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్ మద్దతివ్వడం ఇదే తొలిసారి కాదు... 2019లో కూడా శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్ మద్దతిచ్చి ప్రచారం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ శిల్పా రవిరెడ్డికి మద్దతుగా నంద్యాలలోని ఆయన నివాసానికి వచ్చారు.

శిల్పా రవిచంద్రను కలిసిన తర్వాత అల్లు అర్జున్ నంద్యాలలో మీడియాతో మాట్లాడారు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని అల్లు అర్జున్ తెలిపారు. రవి చంద్ర రాజకీయాల్లోకి రాకముందు ప్రతీ వారం కలిసేవాళ్లమన్నారు. కానీ ఇద్దరు బిజీ అయిపోవడంతో ఆరు నెలలకొకసారి కలుస్తామన్నారు. ప్రజాసేవ చేస్తున్న మనిషికి అండగా నిలవడానికి ఇక్కడకు వచ్చానన్నారు. శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఆయన ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అల్లు అర్జున్ స్వయంగా వచ్చి మద్దతు తెలపటంపై శిల్పా రవి చంద్రారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

మరోవైపు అల్లు అర్జున్ ఇటీవల జననేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పోస్ట్ పెట్టారు. పవన్ ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల తాను ఎంతో గర్విస్తున్నానన్నారు. ఒక కుటుంబ సభ్యునిగా తన ప్రేమ, మద్దతు ఎప్పటికీ పవన్ కే ఉంటుందనన్నారు. పవన్ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ ఈ పోస్టులో రాశారు.

Whats_app_banner