TDP Candidates: నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు, ఉండి ఎమ్మెల్యేగా చోటు దక్కించుకున్న రఘురామ…-change of tdp candidates in four seats mp raghurama will contest from undi assembly ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Tdp Candidates: నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు, ఉండి ఎమ్మెల్యేగా చోటు దక్కించుకున్న రఘురామ…

TDP Candidates: నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు, ఉండి ఎమ్మెల్యేగా చోటు దక్కించుకున్న రఘురామ…

Sarath chandra.B HT Telugu
Apr 19, 2024 10:59 AM IST

TDP Candidates: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించినా, నాలుగు నియోజక వర్గాల్లో అభ్యర్థుల్ని మార్చాలని టీడీపీ అధినేత నిర్ణయించారు.

నాలుగు నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థుల మార్చాలని చంద్రబాబు నిర్ణయం
నాలుగు నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థుల మార్చాలని చంద్రబాబు నిర్ణయం

TDP Candidates: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల్లో నాలుగు నియోజక వర్గాల్లో మార్పులు చేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. గతంలో ప్రకటించిన నియోజక వర్గాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ మార్చింది.

yearly horoscope entry point

పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జోనల్‌ ఇన్‌చార్జుల సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ విషయాన్ని నేతలకు వివరించారు. తాజా జాబితాలో నరసాపురం సిటింగ్‌ ఎంపీ కనుమూరి MP Raghurama రఘురామకృష్ణం రాజుకు అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కింది.

ఉండి Undi Assembly అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా రఘురామ పోటీ చేయనున్నారు. నరసాపురం బీజేపీ BJP అభ్యర్థిగా చోటు దక్కుతుందని రఘురామ భావించినా ఆ పార్టీలో సభ్యత్వం లేకపోవడంతో ఆయనకు చోటు దక్కలేదు. టీడీపీతో ఉన్న సాన్నిహిత్యం వల్లే తనకు చోటు దక్కలేదని రఘురామ అక్రోశం వ్యక్తం చేశారు.

రఘురామకు పోటీ చేసే అవకాశం కల్పించాలని TDP టీడీపీ వర్గాల నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. పొత్తులో నరసాపురం ఎంపీ స్థానం బీజేపీకి వెళ్లి, ఆ స్థానాన్ని వర్మకు కేటాయించడంతో రఘురామ తీవ్ర ప్రయత్నాలు చేశారు. నరసాపురం స్థానం తమకు ఇవ్వాలని టీడీపీ కోరినా బీజేపీ సుముఖత వ్యక్తం చేయలేదు.

బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మకు ఆ పార్టీ బీ-ఫాం కూడా ఇచ్చేసింది. దీంతో రఘురామను ఉండి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఉండిలో టీడీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఖరారు చేశారు. ఆయనకు నచ్చజెప్పి పోటీ నుంచి విరమింప చేయాలని పార్టీ నేతలకు సూచించారు. రామరాజును పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు.

తాజా పరిణామాల నేపథ్యంలో సోమవారం ఉదయం 11.30కు నామినేషన్ వేయనున్నట్లు రఘురామ కృష్ణంరాజు ప్రకటించారు.

అనకాపల్లిలో…

అనకాపల్లి జిల్లాలోని మాడుగుల Madugula Candidate టీడీపీ అభ్యర్థిని కూడా మార్చాలని చంద్రబాబు నిర్ణయించారు. గతంలో ఎన్నారై పైలా ప్రసాదరావుకు మాడుగుల టిక్కెట్ కేటాయించారు. ప్రచారంలో వెనుకబడ్డారని నివేదికలు అందడంతో ప్రసాదరావు స‌్థానంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.

సత్యసాయి జిల్లాలో…

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర రిజర్వుడు నియోజక వర్గంలో ప్రస్తుత అభ్యర్థి అనిల్‌ కుమార్‌ను మార్చి ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజుకు టిక్కెట్ కేటాయించారు. మడకశిరలో మొదట రాజుకు ఇవ్వాలని భావించినా అనిల్‌ కుమార్‌కు కేటాయించారు. అనిల్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం వ్యతిరేకిస్తోంది. దీంతో ఎంఎస్‌ రాజును ఖరారు చేశారు. బాపట్ల ఎంపీ రేసులోకి తెన్నేటి కృష్ణప్రసాద్ రాకముందు ఎం.ఎస్‌.రాజు అభ్యర్థిత్వం పరిశీలించారు.

అన్నమయ్య జిల్లాలో….

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. జయచంద్రారెడ్డి ప్రచారంలో వెనుకబడటంతో పాటు వైసీపీ నేతలతో వ్యాపారాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో మదనపల్లె మాజీ ఎమ్మెల్యే రమేశ్‌ సతీమణి సరళారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌, ఎంఎన్‌సి ఉద్యోగి కొండా నరేంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. తంబళ్లపల్లెపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నారు.

దెందులూరుపై అనుమానాలు…

ఏలూరు జిల్లాలోని దెందులూరు అసెంబ్లీ నియోజక వర్గం కోసం బీజేపీ పట్టుబడుతోంది. అనపర్తిలో రామకృష్ణా రెడ్డి ఆందోళనతో ఆ సీటును టీడీపీకి తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. అనపర్తి స్థానంలో దెందులూరు ఇవ్వాలని బీజేపీ షరతు విధించింది. దెందులూరులో చింతమనేనిని మార్చడానికి స్థానికులు అంగీకరించడం లేదు. దీంతో దెందులూరు, అనపర్తి స్థానాలపై గందరగోళం నెలకొంది.

రాష్ట్రంలో మరి కొన్ని చోట్ల అభ్యర్థుల్ని మార్చాలని నివేదికలు అందడటంతో అభ్యర్థుల మార్పుపై పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మరో మూడు నాలుగు నియోజక వర్గాల్లో కూడా అభ్యర్థుల మార్పుఉండొచ్చని తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థులకు ఈ నెల 21న బిఫారంలు పంపిణీ చేయనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం