TDP Second List: 34మంది పేర్ల తో టీడీపీ రెండో జాబితాను విడుదల చేసిన చంద్రబాబు, మరో 16 పేర్లపై ఉత్కంఠ..
TDP Second List: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇప్పటికే 94మంది పేర్లను ప్రకటించగా రెండో జాబితాలో మరో 34 పేర్లను ఖరారు చేశారు.
TDP Second List: 34పేర్లతో టీడీపీ రెండో జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు Chandrababu ట్విట్టర్‌లో Twitter అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితానుఇప్పటికే ప్రజల ముందు ఉంచామని పేర్కొన్న చంద్రబాబు, ఇప్పుడు మరో 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను మీ ముందుకు తెచ్చినట్టు పేర్కొన్నారు.
తాజా జాబితాలో శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని నరసన్న పేట నుంచి బొగ్గు రమణమూర్తి, విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా చోడవరం నుంచి కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, మాడుగుల నుంచి పైలా ప్రసాద్, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నుంచి వరుపుల సత్యప్రభ, అమలాపురం జిల్లా రామచంద్రపురం నుంచి వాసంశెట్టి సుభాష్ పేర్లను ప్రకటించారు.
రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అరకు పార్లమెంటు పరిధిలోని రంపచోడవరం ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి మిర్యాల శిరీష, రాజమండ్రి పార్లమెంటులోని కొవ్వూరు ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గంలో ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, నరసరావుపేట పార్లమెంటు పరిధిలో పెద్దకూరపాడులో భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి,గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ పేర్లను ఖరారు చేశారు.
నరసరావు పేట పార్లమెంటు పరిధిలోని గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంటు పరిధిలోని మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరులో అశోక్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఆత్మకూరులో ఆనం నారాయణ రెడ్డి, కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తిరుపతి పార్లమెంటులోని వెంకటగిరిలో కురుకొండ్ల లక్ష్మీ ప్రియలను ఖరారు చేశారు.
కడప పార్లమెంటు పరిధిలో కమలాపురంలో పుత్తా చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డి, నంద్యాల పార్లమెంటు పరిధిలోని నందికొట్కూరులో గిత్తా జయసూర్య, కర్నూలు లోక్‌సభ పరిదిలోని ఎమ్మిగనూరులో జయనాగేశ్వర రెడ్డి, మంత్రాలయంలో రాఘవేంద్ర రెడ్డిలకు అభ్యర్ధిత్వం దక్కింది.
హిందూపూర్‌లోని పుట్టపర్తిలో పల్లె సింధురా రెడ్డి, కదిరిలో కందికుంట యశోదాదేవి, రాజంపేట పరిధిలోని మదనపలిల్లో షాజహాన్ బాషా, పుంగనూరులో చల్లా రామచంద్రారెడ్డి, చిత్తూరు పార్లమెంటులోని శ్రీకాళ హస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి, సత్యవేడులో కోనేది ఆదిమూలం, పూతలపట్టులో కలికిరి మురళీ మోహన్‌లను అభ్యర్థులుగా ప్రకటించారు.
రెండో జాబితాలో 25-35ఏళ్ల మధ్య వయసున్న వారు ఇద్దరు, 36-45ఏళ్ల మధ్య వయసున్న వారిలో 8మంది, 46-60ఏళ్ల మధ్య వయసున్న వారు 19, 61-75ఏళ్ల మధ్య వయసున్న వారు ముగ్గురు, 75ఏళ్లకు పైన వయసు ఉన్న వారు ఇద్దరు ఉన్నారు. మొత్తం 34మందిలో పురుషులు 27మంది, మహిళలు ఏడుగురు ఉన్నారు.
అభ్యర్థుల విద్యార్హతలు పరిశీలిస్తే పిహెచ్‌డి విద్యార్హత ఉన్న వారు ఒకరు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న వారు 11మంది, గ్రాడ్యుయేట్‌లు 9మంది, ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న వారు 8మంది, పది లోపు విద్యార్హత ఉన్న వారు ఐదుగురు ఉన్నారు.
సంబంధిత కథనం