AP TS Nominations : ముగిసిన నామినేషన్ల విత్ డ్రా గడువు, టీడీపీ రెబల్ అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయింపు!-ap ts nominations withdrawn completed ec allocated glass symbol to tdp rebel candidate ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Ts Nominations : ముగిసిన నామినేషన్ల విత్ డ్రా గడువు, టీడీపీ రెబల్ అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయింపు!

AP TS Nominations : ముగిసిన నామినేషన్ల విత్ డ్రా గడువు, టీడీపీ రెబల్ అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయింపు!

Bandaru Satyaprasad HT Telugu
Apr 29, 2024 07:56 PM IST

AP TS Nominations : తెలుగు రాష్ట్రాల్లో నేటితో నామినేషన్ల ఉపసంహణ ప్రక్రియ ముగిసింది. దీంతో పోటీలో నిలిచిన అభ్యర్థులపై స్పష్టత వస్తుంది.

ముగిసిన నామినేషన్ల విత్ డ్రా గడువు
ముగిసిన నామినేషన్ల విత్ డ్రా గడువు

AP TS Nominations : ఏపీ, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఉపసంహణ(Nominations Withdrawn) గడువు నేటితో ముగిసింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు(Nominations), 25 లోక్ సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 46 మంది నామినేషన్లు వేయగా, నగరిలో అత్యల్పంగా 6 అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పోటీ చేస్తున్న కుప్పంలో 13 మంది పోటీలో ఉన్నారు. మంగళగిరిలో 40, పులివెందుల(Pulivedula)లో 27 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లను ఈసీ ఆమోదించింది. ఒకే కుటుంబం నుంచి దాఖలైన స్వతంత్ర అభ్యర్థుల నామినేష‌న్లను ఈసీ ఆమోదించలేదు. నంద్యాల పార్లమెంటు స్థానానికి అత్యధికంగా 36 నామినేషన్లు, అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి 12 నామినేషన్లు వచ్చినట్లు ఈసీ తెలిపింది.

తెలంగాణలో

తెలంగాణలోని(TS Nominations) 17 లోక్‌సభ స్థానాలకు 625 నామినేషన్లను ఈసీ(EC) ఆమోదించింది. అయితే వీరిలో 100 మంది అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో 525 మంది తుది పోటీలో నిలిచారు. సికింద్రాబాద్‌(Secunderabad) లోక్‌సభ స్థానం నుంచి అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌ స్థానం నుంచి అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కరీంనగర్ లో 28, పెద్దపల్లిలో 42, నిజామాబాద్‌లో 29, మెదక్ లో 44, జహీరాబాద్‌లో 19, మల్కాజిగిరిలో 22, హైదరాబాద్‌లో 30, చేవెళ్లలో 43 మంది పోటీలో నిలిచారు. నాగర్ కర్నూల్ లో 19, మహబూబ్‌నగర్‌లో 31, నల్గొండలో 22, భువనగిరిలో 39, వరంగల్‌లో 42, మహబూబాబాద్‌లో 23, ఖమ్మం(Khammam)లో 35 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు

జనసేన(Janasena)కు కామన్ సింబల్ గా గాజు గ్లాస్(Glass Symbol) గుర్తును కేటాయించిన ఈసీ.. ఇంతలో మరో షాక్ ఇచ్చింది. జనసేన పోటీలో లేని చోట గ్లాస్ గుర్తును ఇతర అభ్యర్థులకు కేటాయిస్తోంది. ఏపీలో నేటితో నామినేషన్ల ఉపసంహణ ముగిసింది. అయితే పోటీలో నిలిచిన అభ్యర్థులుక గుర్తుల కేటాయించే పనిలో పడింది ఈసీ. గుర్తుల కేటాయింపులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయనగరంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీసాల గీతకు ఎన్నికల అధికారులు గాజు గ్లాసు సింబల్ కేటాయించారు. దీంతో కూటమి నేతల్లో ఆందోళన చెందుతున్నారు. నిబంధనల ప్రకారమే గ్లాసు గుర్తు కేటాయించామని ఎన్నికల అధికారులు తెలిపారు. టీడీపీ రెబల్ అభ్యర్థికి జనసేన గుర్తు కేటాయించడంపై తన గెలుపుపై ప్రభావం చూపుతుందని టీడీపీ అభ్యర్థి ఆందోళన వ్యక్తం చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం