Ysrcp Anakapalli MP Candidate : తండ్రీకూతుళ్లకు వైసీపీ సీట్లు- ఎంపీగా తండ్రి, ఎమ్మెల్యేగా కూతురు పోటీ-amaravati ysrcp announced anakapalli mp candidate budi muthyala naidu ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Amaravati Ysrcp Announced Anakapalli Mp Candidate Budi Muthyala Naidu

Ysrcp Anakapalli MP Candidate : తండ్రీకూతుళ్లకు వైసీపీ సీట్లు- ఎంపీగా తండ్రి, ఎమ్మెల్యేగా కూతురు పోటీ

Bandaru Satyaprasad HT Telugu
Mar 26, 2024 05:34 PM IST

Ysrcp Anakapalli MP Candidate : వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడికి ఛాన్స్ ఇచ్చింది.

తండ్రీకూతుళ్లకు వైసీపీ సీట్లు
తండ్రీకూతుళ్లకు వైసీపీ సీట్లు

Ysrcp Anakapalli MP Candidate : ఏపీలో అధికార వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని(Anakapalli Ysrcp Candidate) ప్రకటించింది. ఇప్పటికే 175 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాలకు ప్రకటించిన వైసీపీ... అనకాపల్లి లోక్ సభ స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది. తాజాగా అనకాపల్లి లోక్ సభ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు(Budi Mutyala Naidu) పేరును ఖరారు చేసింది. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్న వైసీపీ.. మాడుగుల (Madugula)అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కుమార్తె ఈర్లె అనురాధ పేరు ఖరారు చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బూడి ముత్యాలనాయుడు 16,392 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ట్రెండింగ్ వార్తలు

వైసీపీ లోక్ సభ అభ్యర్థుల జాబితా(Ysrcp Lok Sabha Candidates)

  1. శ్రీకాకుళం - పేరాడ తిలక్‌
  2. విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్‌
  3. విశాఖ - బొత్స ఝాన్సీ
  4. అరకు చెట్టి - తనూజ రాణి
  5. రాజమండ్రి - డా. గూడురి శ్రీనివాసులు
  6. కాకినాడ - చెల్మశెట్టి సునీల్
  7. నర్సాపురం - గూడూరి ఉమా బాల
  8. అమలాపురం - రాపాక వరప్రసాద్
  9. ఏలూరు - కారుమూరు సునీల్ కుమార్ యాదవ్
  10. మచిలీపట్నం - సింహాద్రి చంద్రశేఖర్
  11. విజయవాడ - కేశినేని నాని
  12. గుంటూరు - కిలారి రోశయ్య
  13. నరసరావు పేట - అనిల్ కుమార్ యాదవ్
  14. బాపట్ల - నందిగం సురేశ్
  15. నెల్లూరు - విజయసాయిరెడ్డి
  16. ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
  17. తిరుపతి - గురుమూర్తి
  18. చిత్తూరు - ఎన్ రెడ్డప్ప
  19. రాజంపేట - మిథున్ రెడ్డి
  20. కడప - అవినాశ్ రెడ్డి
  21. కర్నూలు - బీవై రామయ్య
  22. నంద్యాల - బ్రహ్మానందరెడ్డి
  23. హిందూపూర్ - జోలదరసి శాంత
  24. అనంతపురం - శంకర్ నారాయణ
  25. అనకాపల్లి - బూడి ముత్యాలనాయుడు

ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్

అనకాపల్లి లోక్ సభ స్థానం(Anakapalle Parliament Constituency) నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ (CM Ramesh)పోటీ పేరును బీజేపీ ప్రకటించింది. టీడీపీ, జనసేనతో పొత్తుల్లో బీజేపీకి అనకాపల్లి ఎంపీ సీటు కేటాయించారు. ఈ స్థానం నుంచి పోటీకి బీజేపీ(BJP) అధిష్టానం సీఎం రమేష్ పేరును ఖరారు చేసింది. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన సీఎం రమేష్, గతంలో టీడీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2019 తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో సీఎం రమేష్ బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీ ఆయనకు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించింది. ఏపీలో కూటమి పార్టీల పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలు(BJP Seats) కేటాయించారు. ఇప్పటికే లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేయగా, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీంతో ఎవరికి సీట్లు దక్కుతాయో అనే ఆసక్తి పార్టీ నేతల్లో నెలకొంది.

WhatsApp channel

సంబంధిత కథనం