Chandrababu : మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతా, నెరవేరిన చంద్రబాబు శపథం-amaravati tdp chief chandrababu old video viral again come to assembly as cm ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Chandrababu : మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతా, నెరవేరిన చంద్రబాబు శపథం

Chandrababu : మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతా, నెరవేరిన చంద్రబాబు శపథం

Chandrababu : 2024 ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు శపథం చేసిన విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయంతో చంద్రబాబు శపథం నెరవేరిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతా, నెరవేరిన చంద్రబాబు శపథం

Chandrababu : ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుది ప్రత్యేక స్థానం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు వైసీపీ ప్రభుత్వం చిక్కులు తప్పలేదు. అసెంబ్లీలో గడ్డు పరిస్థితులు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు...ఇలా వైసీపీ పాలన చంద్రబాబు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారనే చెప్పాలి. అసెంబ్లీలో తన భార్య గురించి ప్రత్యర్థుల మాటలకు చంద్రబాబు మీడియా ముందు కంటతడిపెట్టుకున్నారు. ఈ పరిస్థితులో నేపథ్యంలో మళ్లీ సీఎంగా అసెంబ్లీలో అడుగుపెడతానంటూ...గతంలో శపథం చేశారు. ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీ కూటమి విజయం వైపు దూసుకుపోతుంది. 150కి పైగా స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు చేసిన శపథం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రధాని మోదీకి చంద్రబాబు ఫోన్

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఎన్డీయే కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకోవడంపై టీడీపీ అధినేత వీరిద్దరికీ అభినందనలు తెలిపారు. ఏపీలో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించినందుకు చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోదీ, అమిత్ షా అభినందనలు తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఆయనను ఎన్డీఏ కన్వీనర్ గా నియమించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కేంద్రంలో బీజేపీకి సీట్లు తగ్గడంతో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించనునన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఎన్డీఏ కూటమి కన్వీనర్ నియమించనున్నట్లు ప్రధాని మోదీ, అమిత్ షా ఇప్పటికే చంద్రబాబుకు ఫోన్లో చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనం