AP Beverages Corp MD Transfer : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీపై ఈసీ చర్యలు, తక్షణమే బదిలీ చేయాలని ఆదేశాలు
AP Beverages Corp MD Transfer : ఏపీలో మరో అధికారిపై ఈసీ చర్యలు తీసుకుంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్ ను ఆదేశించింది.
AP Beverages Corp MD Transfer : ఏపీలో ఎన్నికల (AP Elections)నేపథ్యంలో మరో అధికారిపై ఈసీ వేటు వేసింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ(AP Beverages Corp MD) వాసుదేవరెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. తన దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి తక్షణమే విధుల్లోంచి తప్పుకోవాలని వాసుదేవరెడ్డిని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాసుదేవరెడ్డికి(Vasudeva Reddy) ఎలాంటి ఎన్నికల విధుల్ని అప్పగించొద్దని ఈసీ స్పష్టం చేసింది. ఇవాళ రాత్రి 8 గంటల్లోగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ నియామకం కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లు పంపాలని ఈసీ కోరింది. మద్యం ఉత్పత్తి, విక్రయాల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై వాసుదేవరెడ్డిపై చర్యలు ఈసీ చర్యలు తీసుకుంది.
వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని టీడీపీ ఫిర్యాదు
ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ఎండీ వాసుదేవ రెడ్డి(Vasudeva Reddy) అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై ప్రైవేట్ గోదాములలో పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేశారని టీడీపీ(TDP) గతంలో ఆరోపించింది. ఈ మేరకు గత నెలలో ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆయనను బదిలీ చేయాలని లేఖలో ఈసీని కోరింది. ఏపీలో మెజారిటీ డిస్టిలరీలు వైసీపీ నేతల ఆధీనంలో ఉన్నాయని, ఈ డిస్టిలరీల నుంచి అక్రమ మద్యం(Illegal Liquor) ప్రైవేట్ గోదాములకు మళ్లిస్తున్నారని, వాటిని ఎన్నికల్లో పంపిణీ చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ మద్యం నిల్వలు
సీఎం జగన్ నిర్వహించిన సభల్లో మద్యం పంపిణీ చేశారని, అందుకు సంబంధించిన ఆధారాలు ఈసీ(EC)కి అందజేశారు. అక్రమ మద్యం నిల్వ చేసేందుకు అధికార పార్టీ సభ్యులకు వాసుదేవ రెడ్డి సహకరించారని అచ్చెన్నాయుడు(Atchannaidu) లేఖలో ఆరోపణలు చేశారు. ఏపీఎస్బీసీఎల్ ఆధ్వర్యంలోని రిటైల్ లిక్కర్ అవుట్‌లెట్లలో ఎక్కువ మంది సిబ్బంది వైసీపీ మద్దతుదారులేనన్నారు. మద్యం ఉత్పత్తి, విక్రయాలు పూర్తిగా APSBCL నియంత్రణలో ఉండడంతో రాష్ట్రంలో అక్రమంగా మద్యం విక్రయాలు మాత్రమే కాకుండా అక్రమ మద్యం ఉత్పత్తి కూడా జరుగుతోందని అచ్చెన్నాయుడు ఈసీ రాసిన లేఖలో తెలిపారు. ఏపీలో మద్యం ఉత్పత్తి(Liquor), రవాణా, APSBCLకు మద్యం సరఫరా చేస్తున్న డిస్టిలరీలపై నిఘా ఉంచేందుకు ఈసీ ప్రత్యేక బృందాలను నియమించాలని కోరారు. మద్యం ఉత్పత్తి, రవాణా, విక్రయాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని అచ్చెన్నాయుడు ఈసీని కోరారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన ఈసీ విచారణ జరిపి...వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని ఆదేశించింది.
సంబంధిత కథనం