CM Jagan Resigns : గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన జగన్, కాసేపట్లో సీఎం పదవికి రాజీనామా
CM Jagan Resigns : మరికాసేపట్లో జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ భారీ ఓటమి దిశగా పయనిస్తుండడంతో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
CM Jagan Resigns :CM Jagan Resigns : ఏపీ ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. 150కి పైగా స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధిక్యంతో దూసుకుపోతుంది. ఫలితాల నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ కోరారు. కాసేపట్లో గవర్నర్ ను కలిసేందుకు జగన్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ కు తన రాజీనామా లేఖను అందించనున్నారు జగన్.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోరపరాభవాన్ని చవిచూస్తుంది. తాజా అంచనాల ప్రకారం 20 స్థానాలోపు వైసీపీ గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు చోట్ల వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్నారు. రౌండ్ వారీగా ఫలితాలు వెలువడుతుండగా...ఈసారి జనసేన కంటే తక్కువ స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలంతా వెనుకంజలో ఉండడం గమనార్హం. జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా వైసీపీ మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు.
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఓటమి తప్పదని భావిస్తున్న వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ కూటమి స్పష్టమైన మెజార్టీగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ కు కూడా అందనంత దూరంలో టీడీపీ కూటామికి భారీ మెజార్టీ వస్తుంది. టీడీపీ కూటమి 150కి పైగా స్థానాల్లో మెజార్టీ కొనసాగుతుంది. టీడీపీ 131 జనసేన 21, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతున్నాయి. మరోవైపు వైసీపీ చతికిలపడింది. గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచిన వైసీపీ, ప్రస్తుతం కేవలం 18 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతుంది. టీడీపీ కూటమి భారీ విజయం దిశగా అడుగులు వేయగా, వైసీపీ కూటమి భారీ ఓటమి దిశగా అడుగులు వేస్తుంది. ఓటమి చెందుతామని అర్థమైన వైసీపీ నేతలు ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాద్ రెడ్డి, అలాగే రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో టీడీపీ 9 స్థానాల్లో, జనసేన 2 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించింది.
సంబంధిత కథనం