Andhra Pradesh elections : ఓటర్ ఐడీ లేకపోతే ఓటు వేయలేమా? ఓటు వేసే ముందు జాగ్రత్తలు తీసుకోండి..
Andhra Pradesh elections 2024 voting : తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ హడావుడి జోరుగా సాగుతోంది. అయితే.. ఓటు వేసే ముందు కొన్ని విషయాలను మీరు తెలుసుకోవాలి. అవేంటంటే..
Andhra Pradesh elections : ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అటు 2024 లోక్‌సభ ఎన్నికల 4వ దశ పోలింగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో హడావుడి తారస్థాయిలో ఉంది. ప్రజలు పోలింగ్ బూత్‌లకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 9 గంటల వరకు సుమారు 9.05శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల సాయంత్రం 4 గంటల వరకు, చాలా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో.. ఓటింగ్ శాతం పెరుగుతుంది. అయితే.. ఓటర్లు, ఓటు వేసేందుకు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఓటు వేసే ముందు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి..
సోమవారం లోక్‌సభ ఎన్నికలు లేదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ తమ మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.
ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై కఠినమైన నిషేధం ఉంది. అక్కడికి వెళ్లి తిరిగి వచ్చే బదులు మీ మొబైల్‌ని మీ వెంట తీసుకెళ్లకపోవడం ఉత్తమం.
Andhra Pradesh elections live updates : మీరు కుటుంబ సమేతంగా వెళుతున్నప్పటికీ, ఒకరు మొబైల్ ఫోన్‌ను చూసుకుంటూ బయట కూర్చోవలసి ఉంటుంది. ఆలస్యం అవ్వొచ్చు.
ఓటు వేసేటప్పుడు స్లిప్ కనిపించే వరకు (7 సెకన్లు) బటన్‌ను నొక్కి ఉంచండి. ఒక బీప్ శబ్దం వినిపిస్తుంది.
ఈవీఎం మెషీన్‌లోని బటన్‌ను నొక్కినప్పుడు, వీవీప్యాట్ స్లిప్ బయటకు వచ్చే వరకు బటన్ నుంచి వేలిని తీయకూడదని గుర్తుంచుకోండి.
వీవీప్యాట్ స్లిప్‌తో మీ ఓటును నిర్ధరించుకోండి. ఒక వేళ స్లిప్ పడకపోతే.. మీరు బటన్ ప్రెస్ చేసినా ఓటు పడలేదని అర్థం. అందుకే.. వీవీప్యాట్ మిషన్వైపు శ్రద్ధగా చూడండి.
ఓటర్ ఐడీ లేకపోతే ఓటు వేయలేమా?
లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఓటర్ ఐడీ ఉంటే ఓటు వేయొచ్చు. కానీ చివరి నిమిషంలో అది కనిపించకపోతే.. ఇక ఓటు వేయలేమని అనుకోకండి! ఆధార్ కార్డ లేదా ఏ ఇతర గుర్తింపు ఐడీనైనా చూపించి, మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓటర్ ఐడీ ఒక్కటే చూపించాలని రూల్ ఏమీ లేదు.
మీ ఎంపీ- ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ చెక్ చేశారా?
2024 Lok Sabha elections Phase 4 : స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్టు, ఆఫీస్‌లో పర్ఫార్మెన్స్ రివ్యూ ఉన్నట్టు.. 5ఏళ్ల పాటు పాలించే ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా ఒక ప్రోగ్రెస్ కార్డు ఉంటే బాగుండు? అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్.. సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో.. మీ ఎంపీ, ఎమ్మెల్యేల గత 5ఏళ్ల ప్రదర్శనను తెలుసుకునేందుకు.. PRS INDIA వెబ్సైట్ మీకు ఉపయోగపడుతుంది.
ముందుగా.. PRS INDIA అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. పైన కనిపించే 'Find my MP' ఆప్షన్లో.. మీ ఎంపీ పేరును ఎంటర్ చేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం