Dhanashree Verma: ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది - విడాకులపై ధనశ్రీ వర్మ పోస్ట్ - క్రికెట్ మ్యాచ్‌కు చాహల్ డుమ్మా!
Dhanashree Verma: టీమిండియా క్రికెటర్ చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఈ విడాకుల వార్తల నేపథ్యంలో ధనశ్రీ వర్మ పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dhanashree Verma: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నట్లు కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. ధనశ్రీ వర్మ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి చాహల్ డిలీట్ చేయడంలో విడాకుల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఆన్‌ఫాలో చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ధనశ్రీ మాత్రం చాహల్ ఫొటోలను డిలీట్ చేయలేదు.
ప్రతీక్ ఉటేకర్...
విడాకులకు ధనశ్రీ వర్మనే కారణమంటూ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో పాటు టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ వర్మకు ఉన్న స్నేహసంబంధాలే చాహల్, ధనశ్రీ వర్మ మధ్య మనస్పర్థలకు కారణమంటూ కొందరు కామెంట్స్ చేస్తోన్నారు. ధనశ్రీ వర్మను దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు.
నిజాలు తెలుసుకోకుండా...
ఈ ట్రోల్స్‌పై ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రియాక్ట్ అయ్యింది. నిజాలు తెలుసుకోకుండా తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యింది. తనను విలన్‌ను చేస్తూ ద్వేషం పెంచేలా ట్రోల్స్ చేస్తున్నారని, అవన్నీ తనను ఎంతో ఆవేదనకు, బాధకు గురిచేస్తున్నాయని ధనశ్రీ వర్మ చెప్పింది. కొరియోగ్రాఫర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం వెనుక తన ఎన్నో ఏళ్ల శ్రమ, కష్టం ఉన్నాయని ధనశ్రీ వర్మ అన్నది.
బలహీనతగా భావించొద్దు…
“వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తోన్న అబద్దపు ప్రచారాల వల్ల కొన్నాళ్లుగా నేను ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నాను. నా కుటుంబం కూడా చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. నా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు. అదే బలంగా కూడా మారొచ్చు. ఎప్పటికైనా నిజమే గెలిచి తీరుతుందనే నమ్మకంతో ముందుకు సాగుతున్నాను” అంటూ పోస్ట్ పెట్టింది.
ధనశ్రీ వర్మ పోస్ట్ సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది. చాహల్‌ను ఉద్దేశించే ఈ పోస్ట్ ఆమె పెట్టిందని నెటిజన్లు చెబుతోన్నారు.
మ్యాచ్‌కు డుమ్మా...
ఈ విడాకుల వార్తల నేపథ్యంలో చాహల్ విజయ్ హజరే ట్రోఫీ మ్యాచ్‌లకు డుమ్మా కొట్టడం ఆసక్తికరంగా మారింది. దేశవాళీ క్రికెట్‌లో హర్యానా టీమ్‌కు చాహల్ ప్రాతినిథ్యం వహిస్తోన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గురువారం బెంగాళ్‌తో తలపడుతోంది హర్యానా.
విడాకుల వార్తల నేపథ్యంలో అనవసరపు పబ్లిసిటీకి దూరంగా ఉండాలని చాహల్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. కానీ హర్యానా క్రికెట్ అసోసియేషన్ సమాధానం మాత్రం మరోలా ఉంది. కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలనే చాహల్‌ను సెలెక్ట్ చేయలేదని, అతడిని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నమని అన్నది.