Dhanashree Verma: నేను అలాంటిదాన్ని కాదు.. యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ వీడియో వైరల్
Dhanashree Verma Reacts To Trolling: బారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ సోషల్ మీడియా ట్రోలింగ్‌పై మౌనం వీడారు. తనపై వస్తున్న ట్రోలింగ్‌కు గట్టి కౌంటర్ ఇస్తూ ఇన్‌స్టా వేదికగా వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ధనశ్రీ వర్మ వీడియో వైరల్ అవుతోంది.
Yuzvendra Chahal Wife Dhanashree Verma: సోషల్ మీడియా గురించి తెలిసిందే. ఎలాంటి న్యూస్ అయినా అతి తక్కువ సమయంలో కోట్లాది ప్రజలకు చేరిపోతుంది. దాంతో కొంతవరకు లాభాలు ఉన్నప్పటికీ ఎక్కువగా మిస్ యూజ్ జరుగుతుంది. ఇక సోషల్ మీడియా రూమర్స్ వల్ల ఎంతోమంది సెలబ్రిటీలు ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారిలో ఒకరే ధనశ్రీ వర్మ. భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మపై గత కొంతకాలంగా ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
తనపై వస్తున్న ట్రోలింగ్‌పై తాజాగా ధనశ్రీ వర్మ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, తనపై వచ్చే మీమ్స్, సెటైర్స్‌కు తాను ఏమాత్రం భయపడనని, తాను అందరు అనుకుంటున్నట్లుగా తప్పుడు మనిషిని కాదని, కుటుంబానికి విలువ ఇచ్చే వ్యక్తినని ఓ వీడియో ద్వారా వెల్లడించింది ధనశ్రీ వర్మ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
"ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు నేను ఎప్పుడూ ఎఫెక్ట్ కాలేదు. నాపై వచ్చిన ట్రోలింగ్, మీమ్స్ చూసి మెచ్యూర్డ్‌గా ఆలోచించి నవ్వుకునేదాన్ని. కానీ, ఈసారి ఈ ట్రోలింగ్ వల్ల నేను చాలా ఇబ్బందిపడ్డాను. నా కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురి అవుతోంది. సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉండటంతో మా కుటుంబం ఫీలింగ్స్ పట్టించుకోకుండా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాను మంచికే ఉపయోగించుకోవాలి. లేకుంటే ద్వేషం, అసమానత వ్యాప్తి చెందుతుంది" అని ధనశ్రీ వర్మ తెలిపారు.
"నా పనిలో నేను ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటాను. దాన్ని నేను విడిచిపెట్టలేను. అందుకే నేను ధైర్యంగా మాట్లాడేందుకు వచ్చాను. సోషల్ మీడియాలో కాస్తా సెన్సిటివ్‌గా ఉంటూ మా ప్రతిభ, నైపుణ్యాలపై మాత్రమే దృష్టి పెట్టండి. మేమంతా ఎంటర్టైన్ చేసేందుకు ఈ వేదికను ఉపయోగిస్తున్నాం. కాబట్టి నేను కూడా మీ తల్లి, సోదరిలా ఓ మహిళను అనే విషయాన్ని మర్చిపోకండి" అని యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ చెప్పుకొచ్చారు.
"నెను ఓ ఫైటర్‌ను. ఏ విషయానికి భయపడి వెనకడుగు వేయను. ఇకనైనా ఈ సోషల్ మీడియాలో ప్రేమను పంచండి. కాస్తా ఇతరుల పట్ల సున్నితంగా వ్యవహరించండి. విద్వేషం వ్యాప్తి చేయకండి. ఇప్పటి నుంచి మనమందరం మంచి విషయాలపై దృష్టి పెట్టి జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను" అని ధన శ్రీ గట్టి కౌంటర్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే ప్రముఖ హిందీ డ్యాన్స్ రియాలిటీ షో జలక్ దికలాజా సీజన్ 11లో ధనశ్రీ వర్మ కంటెస్టెంట్‌గా చేశారు. ఇందులో అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చి ఫైనల్ వరకు చేరుకున్నారు ధనశ్రీ. ఈ సందర్భంగా తన కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్‌ను ధనశ్రీ హగ్ చేసుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ అయింది. దాంతో ధనశ్రీపై నెటిజన్స్ ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. పెళ్లయ్యకా మరొకరితో అంత సాన్నిహిత్యం ఎందుకంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
సీక్రెట్‌గా ఎఫైర్స్ నడిపిస్తూ చాహల్‌ను మోసం చేస్తోందని దారుణంగా ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్స్. గతంలో కూడా శ్రేయాస్ అయ్యర్‌తో ధనశ్రీ వివాహేతర సంబంధం పెట్టుకుందని రూమర్స్ వచ్చాయి. ఇవన్ని ఇంతకాలం భరించిన ధనశ్రీ తాజాగా అదే సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.