Chahal Wife Dhanashree: డ్యాన్స్ రియాలిటీ షోలో ధ‌న‌శ్రీ వ‌ర్మ - భార్య‌కు స్వీట్‌ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన చాహ‌ల్‌-yuzvendra chahal visits jhalak dikhla jaa sets and surprises his wife dhanasree ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Chahal Wife Dhanashree: డ్యాన్స్ రియాలిటీ షోలో ధ‌న‌శ్రీ వ‌ర్మ - భార్య‌కు స్వీట్‌ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన చాహ‌ల్‌

Chahal Wife Dhanashree: డ్యాన్స్ రియాలిటీ షోలో ధ‌న‌శ్రీ వ‌ర్మ - భార్య‌కు స్వీట్‌ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన చాహ‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Published Jan 11, 2024 12:50 PM IST

Chahal Wife Dhanashree: టీమిండియా స్పిన్న‌ర్ యుజువేంద్ర చాహ‌ల్ స‌తీమ‌ణి ధ‌న‌శ్రీ డ్యాన్స్ రియాలిటీ షో ఝ‌ల‌క్ దిక్లా జాలో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటోంది. భార్య‌కు చెప్ప‌కుండా ఈ రియాలిటీ షో సెట్స్‌లో అడుగుపెట్టిన చాహ‌ల్ ఆమెను స‌ర్‌ప్రైజ్ చేశాడు.

యుజువేంద్ర చాహ‌ల్ ,ధ‌న‌శ్రీ
యుజువేంద్ర చాహ‌ల్ ,ధ‌న‌శ్రీ

Chahal Wife Dhanashree: భార్య ధ‌న‌శ్రీ వ‌ర్మ‌కు స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు టీమిండియా స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్‌. ధ‌న‌శ్రీ వ‌ర్మ ప్ర‌స్తుతం హిందీ డ్యాన్స్ రియాలిటీ షో ఝ‌ల‌క్ దిక్లా జా సీజ‌న్ 11లో కంటెస్టెంట్‌గా పాల్గొంటోంది. వైల్డ్ కార్డ్ ద్వారా ఈ రియాలిటీషోలోకి కంటెస్టెంట్‌గా ధ‌న‌శ్రీ అడుగుపెట్టింది.

ధ‌న‌శ్రీకు తెలియ‌కుండా రియాలిటీ షో సెట్స్‌కు చాహ‌ల్ వ‌చ్చాడు. ఆమెను స‌ర్‌ప్రైజ్ చేశాడ‌ట‌. చాహ‌ల్‌ స‌ర్‌ప్రైజ్‌కు ధ‌న‌శ్రీ వ‌ర్మ థ్రిల్లింగ్‌గా ఫీలైయ్యింద‌ట. చాహ‌ల్ ఝ‌ల‌క్ దిక్లా జా సెట్స్‌లో సంద‌డి చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

ధ‌న‌శ్రీ డ్యాన్స్ అదుర్స్‌...

ఝ‌ల‌క్ దిక్లా జా రియాలిటీ షోలో త‌న డ్యాన్స్ ప‌ర్ఫార్మెన్స్‌ల‌తో జ‌డ్జెస్ మెప్పును పొందింద‌ ధ‌న‌శ్రీ. క్రేజీ కియా రే పాట‌కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఆ డ్యాన్స్ ప‌ర్ఫార్మెన్స్ వీడియో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఆ డ్యాన్స్ ప‌ర్ఫార్మెన్స్ తాలూకు వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.

చాహ‌ల్‌తో ల‌వ్ స్టోరీ...

ఈ రియాలిటీ షోలో చాహ‌ల్‌తో త‌న ల‌వ్ స్టోరీ గురించి అభిమానుల‌తో పంచుకున్న‌ది ధ‌న‌శ్రీ. లాక్‌డౌన్ టైమ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు లేక‌పోవ‌డంతో చాహ‌ల్ డ్యాన్స్ నేర్చుకోవాల‌ని అనుకున్నాడ‌ని, సోష‌ల్ మీడియాలో నా డ్యాన్స్ వీడియోలు చూసి కాల్ చేశాడ‌ని ధ‌న‌శ్రీ చెప్పింది.

డ్యాన్స్ నేర్పే స‌మ‌యంలో త‌మ మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు ధ‌న‌శ్రీ వెల్ల‌డించింది. త‌న‌కు ముందు చాహ‌ల్ ల‌వ్ ప్ర‌పోజ్ చేశాడ‌ని, అత‌డి వ్య‌క్తిత్వం, మంచిత‌నం న‌చ్చి అత‌డి ప్ర‌పోజ‌ల్‌కు తాను ఓకే చెప్పిన‌ట్లు ధ‌న‌శ్రీ వెల్ల‌డించింది. చాహ‌ల్ కూడా మంచి డ్యాన్స‌ర్ అంటూ భ‌ర్త‌పై ధ‌న‌శ్రీ ప్ర‌శంస‌లు కురిపించింది.

చాహ‌ల్ టీమిండియాకు దూరం...

స్పిన్న‌ర్ల మ‌ధ్య పోటీ కార‌ణంగా గ‌త కొంత కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉంటున్నాడు చాహ‌ల్‌. గ‌త ఏడాద జ‌న‌వ‌రిలో చివ‌రి వ‌న్డే మ్యాచ్ ఆడాడు చాహ‌ల్‌. 2023 ఆగ‌స్ట్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్ త‌ర్వాత టీ20ల్లో అత‌డికి అవ‌కాశం ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు.

కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 72 వ‌న్డేలు ఆడిన చాహ‌ల్ 121 వికెట్లు తీసుకున్నాడు. 80 టీ20 మ్యాచుల్లో 96 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో ఒక‌రిగా చాహ‌ల్ రికార్డ్ నెల‌కొల్పాడు. 145 మ్యాచుల్లో 187 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు చాహ‌ల్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

Whats_app_banner