Chahal-Mahvash: చెడు చేయొద్దు.. చెడు వినొద్దు.. చాహల్ తో డేటింగ్ రూమర్స్ వేళ మహ్వాశ్ పోస్ట్.. అర్థం ఏమిటో?
Chahal-Mahvash: టీమిండియా సీనియర్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తో డేటింగ్ రూమర్స్ వస్తున్న వేళ ఆర్జే మహ్వాశ్ చేసిన పోస్టు వైరలైంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది.

టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తో ఆర్జే మహ్వాశ్ డేటింగ్ రూమర్స్ వైరల్ గా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్ లో ఈ జోడీ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. అప్పటి నుంచి వీళ్లు డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి టైమ్ లో ఇన్ స్టాగ్రామ్ లో మహ్వాశ్ పెట్టిన ఓ పోస్టు వైరల్ గా మారింది.
పోస్టులో ఏం ఉందంటే?
చాహల్ తో డేటింగ్ రూమర్స్ వస్తున్న టైంలో మహ్వాశ్ పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘‘ఈ మహ్వశ్ ను చూసి చిన్నప్పటి మహ్వాశ్ ఈ రోజు ఎంతో గర్వపడుతోంది. అదే ముఖ్యం. మన పని మనం చేస్తూనే ఉండాలి. చెడు చేయొద్దు. చెడు వినొద్దు’’ అని ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో మహ్వాశ్ పోస్టు చేసింది. చాహల్ తో మహ్వాశ్ డేటింగ్ చేస్తోందనే వార్తల నేపథ్యంలో ఆమె ఎవరిని ఉద్దేశించి పోస్టు పెట్టిందనేది సీక్రెట్ గా మారింది.
వైరల్ రూమర్స్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్ లో చాహల్-మహ్వాశ్ కనిపించడం వైరల్ గా మారింది. భార్య ధనశ్రీ వర్మ నుంచి చాహల్ విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకే చాహల్ తో మహ్వాశ్ కనిపించింది. స్టాండ్స్ లో వీళ్లిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు. జోక్ లు వేసుకుంటూ నవ్వుకున్నారు. ఇండియా మ్యాచ్ గెలిచాక సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
వెబ్ సిరీస్ లో
ఆర్జే, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా ఉన్న మహ్వాశ్ త్వరలోనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయబోతోంది. యశ్ పట్నాయక్ తెరకెక్కించే అమేజాన్ మినీ సిరీస్ లో నటించేందుకు మహ్వాశ్ కు ఛాన్స్ దక్కింది. ఇన్ స్టాగ్రామ్ లో మహ్వాశ్ కు ఫుల్ క్రేజ్ ఉంది. ఆమెను 2.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ప్రమోషన్స్, ఫొటోషూట్స్ తో ఫుల్ బిజీగా గడుపుతోంది.
మహ్వాశ్ ది ఉత్తర ప్రదేశ్‍లో అలీఘడ్. యూట్యూబ్‍లో ఈమె చాలా పాపులర్. ముందుగా 98.3 ఎఫ్ఎంలో రేడియో జాకీగా తన కెరీర్ మొదలుపెట్టింది. దీంతో ఆర్జే మహ్వాశ్ గా పాపులర్ అయింది. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలతో మరింత ఫేమ్ తెచ్చుకుంది మహ్వశ్. తరచూ ప్రాంక్ వీడియోలను చేస్తుంటుంది. మహిళా సాధికారతకు సంబంధించిన వీడియోలను కూడా చేస్తుంటుంది. మరిన్ని రకాల రిలేటెడ్ కంటెంట్‍తో యూట్యూబ్‍లో ఫేమ్ తెచ్చుకుంది మహ్వశ్.
సంబంధిత కథనం