Yashasvi Jaiswal: టీమ్ఇండియా యువ ఓపెనర్ కు గాయం.. ఛాంపియన్స్ ట్రోఫీ రిజర్వ్ స్థానం డౌటే.. రంజీ సెమీస్ నుంచి ఔట్
Yashasvi Jaiswal: టీమ్ఇండియా యంగ్ ఓపెనర్ యశస్వి జ్వైస్వాల్ గాయం బారిన పడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కు రిజర్వ్ ప్లేయర్ గా అతని స్థానం సందేహంలో పడింది. గాయంతో రంజీలో ముంబయి సెమీస్ మ్యాచ్ కు అతను దూరమయ్యాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కు భారత ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాడిగా ఎంపికైన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు పాత గాయం తిరగబెట్టింది. అతను చీలమండ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి రిజర్వ్ ఆటగాడిగా అతని స్థానం సందేహంలో పడింది. ఒకవేళ అవసరమైతే ఐసీసీ అనుమతితో రిజర్వ్ ఆటగాళ్లను టోర్నీలో ఆడిస్తారు. ఈ నేపథ్యంలో బ్యాకప్ ఓపెనర్ గా యశస్విని రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేశారు.
ముంబయికి షాక్
రంజీ ట్రోఫీ సెమీస్ కోసం సిద్ధమవుతున్న ముంబయి జట్టుకు జైస్వాల్ గాయంతో షాక్ తగిలింది. సోమవారం (ఫిబ్రవరి 17) రంజీ సెమీ ఫైనల్లో విదర్భతో ముంబయి తలపడనుంది. నాగ్ పుర్ లో జరిగే ఈ మ్యాచ్ లో జైస్వాల్ ను ఆడించాలని ముంబయి భావించింది. కానీ ఇప్పుడు ఈ ఓపెనర్ కు గాయంతో షాక్ తప్పలేదు. జైస్వాల్ జట్టులోకి వస్తే ముంబయి టాప్ఆర్డర్ మరింత బలంగా మారేది.
అక్కడికి జైస్వాల్
చీలమండ నొప్పితో బాధపడుతున్న జైస్వాల్ కోలుకునేందుకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కు వెళ్లనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన రిపోర్ట్ లో తెలిపింది. ముంబయి ప్రాక్టీస్ సెషన్లో నెట్స్ లో బ్యాటింగ్ చేసే సమయంలో జైస్వాల్ అసౌకర్యంగా కనిపించాడు. ఇది పాత గాయమే మళ్లీ తిరిగబెట్టినట్లు తెలిసింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైనా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మొదట ఎంపిక చేసిన భారత జట్టులో యశస్వి జైస్వాల్ కు చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ తో తొలి వన్డేతో ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. కానీ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం జైస్వాల్ ను తప్పించారు. ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు జైస్వాల్ కు గాయంతో మరొక ఆటగాడిని రిజర్వ్ ప్లేయర్ గా ఎంచుకోక తప్పదు.
సంబంధిత కథనం