WPL 2025: ఆర్సీబీదే టాస్.. డబ్ల్యూపీఎల్ షురూ.. ఇన్నింగ్స్ బ్రేక్ లో మ్యూజికల్ ట్రీట్-wpl 2025 starts with bang toss won by royal challengers bengaluru vs gujarat gaints opening ceremony ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl 2025: ఆర్సీబీదే టాస్.. డబ్ల్యూపీఎల్ షురూ.. ఇన్నింగ్స్ బ్రేక్ లో మ్యూజికల్ ట్రీట్

WPL 2025: ఆర్సీబీదే టాస్.. డబ్ల్యూపీఎల్ షురూ.. ఇన్నింగ్స్ బ్రేక్ లో మ్యూజికల్ ట్రీట్

Chandu Shanigarapu HT Telugu
Published Feb 14, 2025 07:47 PM IST

WPL 2025: వుమెన్స్ ప్రిమియర్ లీగ్ కు తెరలేచింది. డబ్ల్యూపీఎల్ 2025 శుక్రవారం (ఫిబ్రవరి 14) ఆరంభమైంది. తొలి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. టాస్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఆరంభమైన డబ్యూపీఎల్ 2025.. తొలి మ్యాచ్ లో బెంగళూరు వర్సెస్ గుజరాత్
ఆరంభమైన డబ్యూపీఎల్ 2025.. తొలి మ్యాచ్ లో బెంగళూరు వర్సెస్ గుజరాత్ (x/wplt20)

డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ ఆరంభమైంది. గుజరాత్ జెయింట్స్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య వడోదరలో తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మంధాన ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ కు దిగింది. గుజరాత్ కు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్టీ గార్డ్ నర్ కెప్టెన్. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ మధ్యలో డబ్ల్యూపీఎల్ ఆరంభోత్సవ కార్యక్రమాలు జరగబోతున్నాయి.

క్రికెటర్ల అరంగేట్రం

ఈ మ్యాచ్ తో కొంతమంది యంగ్ క్రికెటర్లు డబ్ల్యూపీఎల్ అరంగేట్రం చేశారు. ఆర్సీబీ తరపున ప్రేమ రావత్, వీజే జోషిత,రాఘవి బిష్ట్ లీగ్ లో డెబ్యూ చేశారు. ఆ జట్టు ఈ మ్యాచ్ లో ఫారెన్ ప్లేయర్లుగా పెర్రీ, వారెహం, వ్యాట్, గార్థ్ ను ఆడిస్తోంది. ఆర్సీబీ గత సీజన్ లో ఛాంపియన్.

అయిదుగురు

గుజరాత్ జెయింట్స్ తరపున ఏకంగా అయిదుగురు క్రికెటర్లు డబ్ల్యూపీఎల్ డెబ్యూ చేశారు. ప్రియ మిశ్రా, కేశవి గౌతమ్, సయాలి సత్ఘారె, డాటిన్, సిమ్రాన్ షేక్ ఈ లీగ్ లో తొలి మ్యాచ్ కోసం బరిలో దిగారు. గుజరాత్ జెయింట్స్ లో లారా వోల్వార్ట్, బెత్ మూనీ, గార్డ్ నర్, డాటిన్ విదేశీ క్రికెటర్లుగా ఆడుతున్నారు.

తుది జట్లు:

ఆర్సీబీ: మంధాన, డాని వ్యాట్, ఎలీస్ పెర్రీ, రాఘవి బిస్ట్, రిచా ఘోష్, కనిక అహుజ, జార్జియా వారెహం, కిమ్ గార్థ్, ప్రేమ రావత్, వీజే జోషిత, రేణుక సింగ్

జీజీ: లారా వోల్వార్ట్, బెత్ మూనీ, హేమలత, ఆష్టీ గార్డ్ నర్, డాటిన్, హర్లీన్ డియోల్, సిమ్రాన్ షేక్, కేశవి గౌతమ్, తనుజ కన్వార్, సయాలి, ప్రియ మిశ్రా

Chandu Shanigarapu

eMail
Whats_app_banner

సంబంధిత కథనం