WPL Final: ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. రేపే ఫైనల్.. ఎప్పుడు? ఎక్కడ? చూడాలంటే.. టైం, స్ట్రీమింగ్ ఇలా-wpl 2025 final mumbai indians vs delhi capitals where to watch when time and streaming details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl Final: ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. రేపే ఫైనల్.. ఎప్పుడు? ఎక్కడ? చూడాలంటే.. టైం, స్ట్రీమింగ్ ఇలా

WPL Final: ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. రేపే ఫైనల్.. ఎప్పుడు? ఎక్కడ? చూడాలంటే.. టైం, స్ట్రీమింగ్ ఇలా

WPL Final: వుమెన్స్ ప్రిమియర్ లీగ్ 2025 ఫైనల్ కు రంగం సిద్ధమైంది. రేపే (మార్చి 15) ఫైనల్. ఈ టైటిల్ పోరు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎక్కడ చూడొచ్చు? అనే వివరాలు మీకోసం.

డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (x/cricbuzz)

డబ్ల్యూపీఎల్ 2025 ఫైనల్ ఫైట్ కు అంతా రెడీ. శనివారం (మార్చి 15) టైటిల్ పోరులో ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతోంది. ఈ మెగా క్లాష్ కు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ టైటిల్ పోరు ఎప్పుడు? ఎక్కడ? చూడాలో తెలిపే వివరాలు ఇవి.

  • ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డబ్ల్యూపీఎల్ 2025 మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ముంబయిలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
  • డబ్ల్యూపీఎల్ 2025 ఫైనల్ పోరును టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెటవర్క్ ఛానెల్స్ లో చూడొచ్చు.
  • డబ్ల్యూపీఎల్ 2025 ఫైనల్లో ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ స్ట్రీమింగ్ వేదిక జియోహాట్ స్టార్. ఈ ఓటీటీలో మ్యాచ్ ను చూడొచ్చు.
  • డబ్ల్యూపీఎల్ లో లీగ్ స్టేజీలో 8 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించిన ఢిల్లీ 10 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ముంబయి ఇండియన్స్ కూడా 10 పాయింట్లే సాధించినా.. బెటర్ రన్ రేట్ తో టాప్ ప్లేస్ లో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్ చేరింది.
  • టేబుల్ లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ముంబయి, గుజరాత్ జెయింట్స్ ఎలిమినేటర్ లో తలపడ్డాయి. గుజరాత్ పై గెలిచి ముంబయి ఫైనల్ చేరింది.
  • 2023 డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ముంబయి, ఢిల్లీ తలపడ్డాయి. అప్పుడు ముంబయి గెలిచింది. గత సీజన్ లోనూ ఢిల్లీ ఫైనల్ చేరింది. కానీ 2024లో ఆర్సీబీ చేతిలో ఓడింది.
  • వరుసగా మూడు డబ్ల్యూపీఎల్ సీజన్లలోనూ ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి టైటిల్ విడవకూడదనే టార్గెట్ పెట్టుకుంది. ఆ జట్టుకు బ్యాటింగ్ లో షెఫాలి వర్మ, కెప్టెన్ మెగ్ లానింగ్ కీలకం. బౌలింగ్ లో జెస్ జొనాసెన్, శిఖా పాండే పై ఆశలున్నాయి.
  • మరోవైపు ముంబయి ఇండియన్స్ రెండో టైటిల్ పై గురి పెట్టింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఆ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో సాగుతోంది. బ్యాటింగ్ లో నాట్ సీవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్, హర్మన్ ప్రీత్ కౌర్ ముంబయికి కీలకం. బౌలింగ్ లో ముంబయి ప్లేయర్లు హేలీ మాథ్యూస్, అమేలియా కెర్ అదరగొడుతున్నారు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం