World Cup 2023 Photos: మరోసారి సచిన్ చేతుల్లో వరల్డ్ కప్.. సింపుల్‌గా మొదలైన మెగా టోర్నీ
- World Cup 2023 Photos: మరోసారి సచిన్ టెండూల్కర్ చేతుల్లో వరల్డ్ కప్ ట్రోఫీ కనిపించింది. వరల్డ్ కప్ 2023 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సింపుల్‌గా మొదలైంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది.
- World Cup 2023 Photos: మరోసారి సచిన్ టెండూల్కర్ చేతుల్లో వరల్డ్ కప్ ట్రోఫీ కనిపించింది. వరల్డ్ కప్ 2023 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సింపుల్‌గా మొదలైంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది.
(1 / 7)
World Cup 2023 Photos: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 గ్లోబల్ అంబాసిడర్ గా నియమితుడైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకురావడం విశేషం.
(AP)(2 / 7)
World Cup 2023 Photos: 2011లో తాను ఆడిన చివరి వరల్డ్ కప్ లోగానీ ఈ ట్రోఫీని ముద్దాడే అదృష్టం అతనికి కలగలేదు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఇండియాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ట్రోఫీని తీసుకొచ్చి గ్రౌండ్లో ఉంచే అవకాశం వచ్చింది.
(REUTERS)(3 / 7)
World Cup 2023 Photos: వరల్డ్ కప్ 2023 ట్రోఫీని గ్రౌండ్లో ఉంచిన తర్వాత అభిమానులకు అభివాదం చేస్తున్న సచిన్ టెండూల్కర్.
(REUTERS)(4 / 7)
World Cup 2023 Photos: వరల్డ్ కప్ 2023 తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు జట్ల కెప్టెన్లు టీమ్ ను లీడ్ చేస్తూ గ్రౌండ్లోకి అడుగుపెట్టారు. ఈ మ్యాచ్ కు కేన్ విలియమ్సన్ లేకపోవడంతో న్యూజిలాండ్ టీమ్ కు టామ్ లేథమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
(REUTERS)(5 / 7)
World Cup 2023 Photos: వరల్డ్ కప్ 2023 ఎలాంటి ఓపెనింగ్ సెర్మనీ లేకుండా సింపుల్ గా ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నరేంద్ర మోదీ స్టేడియం ముందు అభిమానుల సందడి.
(AFP)(6 / 7)
World Cup 2023 Photos: లక్ష మంది అభిమానులకుపైగా ప్రత్యక్షంగా మ్యాచ్ చూసే అవకాశం ఉన్న ఈ స్టేడియం మ్యాచ్ ప్రారంభ సమయానికి కూడా చాలా వరకూ ఖాళీగానే కనిపించింది.
(REUTERS)(7 / 7)
World Cup 2023 Photos: ఇంగ్లండ్ తో మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం సందర్భంగా న్యూజిలాండ్ ప్లేయర్స్. 2019 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ చేతుల్లో వీరోచితంగా పోరాడి ఓడింది కివీస్ టీమ్. ఆ మ్యాచ్ మొదట టైగా ముగియడంతో సూపర్ ఓవర్ తప్పలేదు. అయితే సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమం కావడంతో ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది.
(REUTERS)ఇతర గ్యాలరీలు