World Cup Anthem: వరల్డ్ కప్ ఆంథమ్ రిలీజ్ - రణ్‌వీర్‌సింగ్ స్పెషల్ అట్రాక్షన్
World Cup Anthem: వన్డే వరల్డ్ కప్ ఆంథమ్‌ను బుధవారం ఐసీసీ రిలీజ్ చేసింది. బాలీవుడ్ కంపోజర్ ప్రీతమ్ మ్యూజిక్ అందించిన ఈ పాటలో రణ్‌వీర్‌సింగ్ నటించాడు. ఈ వరల్డ్ కప్ ఆంథమ్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
World Cup Anthem: వన్డే వరల్డ్ కప్ ఆంథమ్‌ను ఐసీసీ బుధవారం రిలీజ్ చేసింది. ట్రెడిషనల్ ఇండియన్ మ్యూజికల్ ఇన్‌స్ట్రూమెంట్స్ ఉపయోగిస్తూ ఇంటర్‌నేషనల్ ఫ్లేవర్ లిరిక్స్‌తో సాగిన దిల్ జషన్ బోలే అంటూ సాగిన ఈ పాట క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఆంథమ్‌లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ నటించాడు. అతడు ఈ సాంగ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఆ వరల్డ్ కప్ ఆంథమ్‌కు బాలీవుడ్ కంపోజర్ ప్రీతమ్ సంగీతాన్ని అందించాడు.
ప్రీతమ్, నకాష్ అజీజ్, శ్రీరామచంద్ర, అమిత్ మిశ్రా, జోనితా గాంధీ, అక్సా, చరణ్ ఆలపించారు. శ్లోకేలాల్, సావేరి వర్మ పాటకు సాహిత్యాన్ని అందించారు. ఈ పాటలోని లిరిక్స్, మ్యూజిక్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బౌలింగ్ వేసినట్లుగా, బ్యాటింగ్ చేసినట్లుగా రణ్‌వీర్‌సింగ్ డిఫరెంట్ స్టెప్పులు వేసి అలరించారు. వివిధ దేశాల క్రికెట్ జెర్సీలను ,జెండాలను ధరించి ఫ్యాన్స్ ఈ పాటలో కనిపించారు.
వన్డే ఎక్స్‌ప్రెస్ అనే ట్రైన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ పాటను షూట్ చేశారు. ట్రైన్‌లో కొందరు క్రికెట్ ఆడటం, ఓ ఆటగాడు షాట్ కొట్టగా విండో గ్లాస్ బ్రేక్ కావడం...ఆ షాట్‌ను అంపైర్ సిక్స్ అంటూ ప్రకటించే ఈ పాటలో హైలైట్‌గా నిలుస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎమోషన్స్‌ను పాటలో రియలిస్టిక్‌గా చూపించారు. వరల్డ్ కప్ ఆంథమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వన్డే వరల్డ్ కప్ ఆక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానుంది. ఈ వరల్డ్ కప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది.