bumrah injury update: బుమ్రాపై ఫైనల్ డిసిషన్ అప్పుడే.. ఛాంపియన్స్ ట్రోఫీలో స్టార్ పేసర్ ఆడేనా?
bumrah injury update: ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడటంపై మంగళవారం (ఫిబ్రవరి 11) క్లారిటీ రానుంది. వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న అతని ఫిట్ నెస్ పై బీసీసీఐ అప్ డేట్ ఇవ్వనుంది.

బుమ్రా ఇంజూరీ అప్ డేట్
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతాడా? లేదా? అనే ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది. ఫిబ్రవరి 11న బుమ్రాపై బీసీసీఐ ఫైనల్ డిసిషన్ తీసుకోనుంది. ఈ ట్రోఫీ లో పాల్గొనే జట్లు ఆటగాళ్లను మార్చుకునేందుకు ఈ నెల 11 లాస్ట్ డేట్. అందుకే ఆ రోజే బుమ్రా విషయంలో ఏదో ఒకటి తేల్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది.
జట్టులోకి ఎంపిక చేసినా
ఇప్పటికే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు, ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులో బుమ్రాను ఎంపిక చేశారు. కానీ వెన్నెముక గాయం నుంచి అతను ఇంకా కోలుకోకపోవడంతో ఇంగ్లండ్ తో తొలి రెండు వన్డేలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇంగ్లండ్ తో బుధవారం (ఫిబ్రవరి 12) జరిగే మూడో వన్డేలోనూ బుమ్రా ఆడటం అసాధ్యమే.
స్కాన్ లు కంప్లీట్
బుమ్రా వెన్నెముక గాయాన్ని అంచనా వేసేందుకు ఇటీవల స్కాన్ లు తీశారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో ఈ స్కాన్ లు నిర్వహించారు. వీటి రిపోర్టులను బీసీసీఐ మెడికల్ స్టాఫ్ పరీక్షిస్తోంది. బీసీసీఐ సెలక్టర్లు, టీమ్ మేనేజ్ మెంట్ తో ఆ మెడికల్ స్టాఫ్ కో ఆర్డినేట్ చేస్తోంది. ఆ రిపోర్టులను బట్టి బుమ్రాపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు.
బుమ్రా ఆడేనా?
జనవరిలో ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో వెన్నెముక నొప్పితో బుమ్రా మైదానం వీడిన సంగతి తెలిసిందే. ఒకవేళ బుమ్రా కోలుకోకపోతే అతని స్థానంలో హర్షిత్ రాణాను తీసుకునే అవకాశముంది. టోర్నీలో తర్వాతి మ్యాచ్ లకు బుమ్రా అందుబాటులోకి వచ్చే సూచనలు ఉంటే 15 మంది జట్టులో కొనసాగించే ఛాన్స్ ఉంది.
సంబంధిత కథనం