MI vs CSK : ఈ ఐపీఎల్ 2024లో సీఎస్కే- ఎంఐ ఆడేది ఒక్కసారే.. కారణం ఇదే!
MI vs CSK IPl 2024 : ఐపీఎల్ 2024 షెడ్యూల్లో సీఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఒకటే సారి ఉంది. ఇందుకు కారణం ఏంటి?
MI vs CSK 2024 : ఎంఎస్ ధోనీ విధ్వంసం, రోహిత్ శర్మ మెరుపులతో ఆదివారం వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్ చూసిన అభిమానులు థ్రిల్ అయిపోయారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ఎంఐ ఓడిపోయినా.. ప్రేక్షకులు కోరుకున్న పవర్ప్యాక్ట్ యాక్షన్ లభించింది! కానీ.. ఐపీఎల్ ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 2024 షెడ్యూల్ ప్రకారం.. సీఎస్కే- ఎంఐ మ్యాచ్ ఒకటే సారి ఉంటుంది. అది ఆదివారం జరిగిపోయింది. అసలు కారణం ఏంటంటే..

ఐపీఎల్ 2024లో సీఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్..
సాధారణంగా.. ఐపీఎల్లో ప్రతి జట్టు.. మరో టీమ్‌తో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. కానీ ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఎంట్రీతో పరిస్థితులు మారిపోయాయి. ఐపీఎల్లో అప్పటివరకు 8గా ఉన్న టీమ్స్ సంఖ్య.. ఇప్పుడు 10కి చేరింది. ఈ 10 జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది.
MS Dhoni IPL 2024 : ఈ ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు వేరువేరు గ్రూపుల్లో ఉన్నాయి. ప్రస్తుత ఫార్మాట్ ప్రకారం.. ఒక జట్టు తన గ్రూపులోని ఇతర జట్లతో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులోనే హోం, అవే (ఇంట, బయట) మ్యాచ్‌లు ఉంటాయి. ఈ 8 ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు.. ప్రతి జట్టు.. మరో గ్రూప్‌లోని ఇతర ఫ్రాంచైజ్‌లతో 4 మ్యాచ్‌లు ఆడుతుంది. అది ఇంట అవ్వొచ్చు లేద బయటా అవ్వొచ్చు. ఇదంతా ర్యాండమ్ డ్రాగా తీస్తారు. ఫలితంగా.. ఈ ఐపీఎల్ 2024లో సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ ఒక్కసారే ఫిక్స్ అయ్యింది.
ఇది ఫ్యాన్స్‌కు ఒకింత బాధాకరమైన విషయమే! ఐపీఎల్లో సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ని క్లాష్ ఆఫ్ టైటాన్స్, సమవుజ్జీల పోరుగా భావిస్తారు. ఆదివారం వాఖండే వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే కనిపించింది. కానీ ఈసారికి ఈ రెండు జట్లు ఒక్కసారే పోటీపడతాయంటే.. మంచి యాక్షన్ మిస్ అయ్యిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పైగా.. ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అయితే.. వాఖండేలో ఈ దిగ్గజ ప్లేయర్, తన చివరి మ్యాచ్ ఆడేసినట్టే!
రోహిత్ శర్మ సెంచరీ పోరాటం వృథా..
IPL 2024 latest news : చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ చేసినా తన టీమ్‌ను గెలిపించలేకపోయాడు రోహిత్ శర్మ. ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌తో చేసిన ఆ 20 పరుగులే చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ మార్జిన్ అయింది. అయితే ఈ సెంచరీతో ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చాడు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్. ప్రస్తుతం అతడు టాప్ 5లో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 186 రన్స్ చేసింది. ఇరవై పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం