india vs england 3rd odi live: ఇండియా, ఇంగ్లండ్ క్రికెటర్ల చేతులకు గ్రీన్ ఆర్మ్ బ్యాండ్లు.. ఎందుకు ధరించారంటే?
india vs england 3rd odi live: అహ్మదాబాద్ లో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్, భారత క్రికెటర్లు ఆకుపచ్చటి ఆర్మ్ బ్యాండ్లు ధరించారు. దీని వెనుక ఓ స్పెషల్ రీజన్ ఉంది. ఆర్గన్స్ డోనేషన్ కు మద్దతుగా ఇలా చేశారు.

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య బుధవారం (ఫిబ్రవరి 12) జరుగుతున్న మూడో వన్డేకు ఓ స్పెషాలిటీ ఉంది. రెండు జట్ల ఆటగాళ్లు గ్రీన్ ఆర్మబ్యాండ్లు ధరించి ఆడుతున్న విషయాన్ని మీరు గమనించే ఉంటారు. సాధారణంగా అయితే క్రికెట్ మ్యాచ్ ల్లో ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ బ్యాండ్లు ధరిస్తారు. మరణించిన వాళ్లకు నివాళిగా అలా చేస్తారు. కానీ ఈ మ్యాచ్ లో గ్రీన్ ఆర్మ్ బ్యాండ్లు ధరించడం వెనుక ఓ రీజన్ ఉంది.
అవయవ దానం
ఆర్గాన్ డొనేషన్ కు సపోర్ట్ గా ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్, భారత్ క్రికెటర్లు ఈ గ్రీన్ ఆర్మ్ బ్యాండ్లు ధరించారు. ‘డొనేట్ ఆర్గన్స్ సేవ్ లైవ్స్’ అనే క్యాంపెయినింగ్ కు ఈ మ్యాచ్ సందర్భంగా రెండు జట్లు మద్దతుగా నిలిచాయి. టాస్ కు ముందు భారత కెప్టెన్ రోహిత్, ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ ‘డొనేట్ ఆర్గన్స్ సేవ్ లైవ్స్’ అనే బోర్డు పై సంతకాలు చేశారు. ఇతరుల నుంచి ఊపిరితిత్తులు తీసుకున్న గుజంన్ ఉమాంగ్, కిడ్రీ గ్రహీత దీప్తి తో కలిసి రోహిత్, బట్లర్ ఫొటోలు దిగారు.
బీసీసీఐ క్యాంపెయిన్
ఆర్గన్ డోనేషన్ క్యాంపెయినింగ్ బీసీసీఐ గొప్ప సపోర్ట్ ను అందిస్తోంది. కోహ్లి, గిల్, షమి లాంటి ఆటగాళ్లు బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో అవయవ దానం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పటికే టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ తన ఆర్గన్స్ డొనేట్ చేస్తానని ప్రకటించాడు. ఒకరి అవయవ దానంతో ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చు.
టీమ్ఇండియా బ్యాటింగ్
ఇప్పటికే వరుసగా రెండో వన్డేల్లో గెలిచి సిరీస్ ను 2-0తో సొంతం చేసుకున్న భారత్.. మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో షమి, జడేజా, వరుణ్ స్థానాల్లో అర్ష్ దీప్, వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ ను భారత్ ఆడిస్తోంది.
సంబంధిత కథనం