IPL Umpire Tanmay Srivastava: కోహ్లీతో కలిసి అండర్-19 ప్రపంచకప్ గెలిచాడు.. కట్ చేస్తే ఇప్పుడు ఐపీఎల్ అంపైర్.. ఎవరతను?
IPL Umpire Tanmay Srivastava: 2008 అండర్-19 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీతో కలిసి ఆడిన ఆటగాడు ఇప్పుడు ఐపీఎల్ అంపైర్ గా అరంగేట్రం చేయబోతున్నాడు. ఆ టోర్నీ ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడిన ఆ ఆటగాడు ఎవరో చూసేయండి.
2008 లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో అనేకమంది ఆటగాళ్ళు తర్వాత క్రికెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతమంది అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగారు. కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం కనుమరుగయ్యారు. ఆ టీమ్ లో కోహ్లీతో కలిసి ఆడిన తన్మయ్ శ్రీవాస్తవ ఇప్పుడు ఐపీఎల్ అంపైర్ గా అరంగేట్రం చేయబోతున్నాడు.
విన్నింగ్ లో కీ రోల్
2008 అండర్-19 వరల్డ్ కప్ ను భారత్ గెలవడంలో ఉత్తరప్రదేశ్ ఆటగాడు తన్మయ్ శ్రీవాస్తవ కీ రోల్ ప్లే చేశాడు. ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై భారత విజయంలో శ్రీవాస్తవ కీలక పాత్ర పోషించాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 46 పరుగులు చేశాడు. 45.4 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయిన భారత జట్టులో అతనిదే అత్యధిక స్కోర్.
ఛేజింగ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఛేజింగ్ లో ప్రోటీస్ జట్టును 103/8 పరుగులకు పరిమితం చేశారు. దీంతో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇప్పుడు అంపైర్ గా
భారత్ అండర్-19 వరల్డ్ కప్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన తన్మయ్ శ్రీవాస్తవ ఇప్పుడు ఐపీఎల్ 2025లో అంపైర్ గా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్ కు ఎంపిక చేసిన అంపైర్లలో తన్మయ్ కు చోటు దక్కిందని అధికారిక ప్రకటన వెలువడింది. శ్రీవాస్తావ దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ప్రొఫెషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అప్పటి నుండి దేశీయ మ్యాచ్ లలో అంపైర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఇప్పుడు.. బీసీసీఐ అతన్ని ఐపీఎల్ అంపైర్ గా నియమించింది, ఈ నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. “ఒక నిజమైన ఆటగాడు ఎప్పుడూ మైదానాన్ని వీడడు. కేవలం ఆటను మారుస్తాడు. కొత్త బాధ్యత అందుకున్న తన్మయ్ శ్రీవాస్తవకు శుభాకాంక్షలు” అని న అధికారిక ఎక్స్ ఖాతాలో రాసింది.
ఐపీఎల్ లో ఆటగాడిగా
శ్రీవాస్తావకు ఆటగాడిగానూ ఐపీఎల్ అనుభవం కూడా ఉంది. 2008, 2009 సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) తరపున అతను ఏడు మ్యాచ్ లు ఆడాడు. అయితే, బ్యాట్ తో పెద్దగా రాణించలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్ లలో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. దేశీయ క్రికెట్ లో మాత్రం 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 4,918 పరుగులు చేశాడు.
సంబంధిత కథనం