Team India: పదో నంబర్ బ్యాటర్‌గా ఎంట్రీ -ఓపెనర్‌గా ప్రమోషన్-30 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై -ఆ క్రికెటర్ ఎవరంటే?
Team India: టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రవిశాస్త్రి...పదో నంబర్ బ్యాటర్‌గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఓపెనర్‌గా ప్రమోషన్ పొందాడు. 18 ఏళ్ల వయసులో క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చిన రవి శాస్త్రి 30 ఏళ్లకే రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
Team India: పదో నంబర్ బ్యాటర్‌గా అరంగేట్రం చేసిన ఓ క్రికెటర్ ఓపెనర్‌గా బరిలోకి దిగడం అన్నది అరుదు. అలాంటి అరుదైన రికార్డు టీమిండియా దిగ్గజ ఆటగాడు రవిశాస్త్రి పేరిట ఉంది. టీమిండియా బెస్ట్ ఆల్‌రౌండర్స్‌లో ఒకరిగా రవి శాస్త్రి పేరు తెచ్చుకున్నాడు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
18 ఏళ్లకే ఎంట్రీ...
1981లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు రవిశాస్త్రి. అప్పటికి రవిశాస్త్రి వయసు 18 ఏళ్లు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో పదో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. డెబ్యూ టెస్ట్‌లోనే ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. న్యూజిలాండ్ సిరీస్‌తో సెలెక్టర్ల దృష్టిని ఆకట్టుకున్న రవి శాస్త్రి కొద్ది రోజుల్లోనే టీమిండియా మెయిన్ ప్లేయర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.
ఓపెనింగ్ స్థానంలో...
1982లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రవిశాస్త్రి ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ దిగాడు. ఓపెనర్‌గా దిగిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో రాణించాడు. 1983 వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన రవిశాస్త్రి బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. పదేళ్ల కెరీర్‌లో ఆల్‌రౌండర్‌గా పలు రికార్డులు తిరగరాశాడు.
ఆరు బాల్స్‌లో ఆరు సిక్స్‌లు...
1984 రంజీ సీజన్‌లో ముంబై తరఫున బరిలో దిగిన రవిశాస్త్రి బరోడాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఆరు బాల్స్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
కెరీర్ పీక్స్‌లో ఉండగానే మోకాలి గాయం కారణంగా 1992లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు రవిశాస్త్రి. 30 ఏళ్ల వయసులోనే అతడు రిటైర్‌మెంట్ ప్రకటించడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
80 టెస్ట్‌లు...150 వన్డేలు...
టీమిండియా తరఫున 80 టెస్ట్‌లు ఆడిన రవిశాస్త్రి 3830 రన్స్‌తో పాటు 151 వికెట్లు తీశాడు. 150 వన్డేలు ఆడిన రవిశాస్త్రి 3108 రన్స్‌తో పాటు 129 వికెట్లు దక్కించుకున్నాడు.
కోచ్‌గా...
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రవిశాస్త్రి ఆ తర్వాత కామెంటేటర్‌గా అవతారం ఎత్తాడు. రవిశాస్త్రి వాయిస్ లేకుండా క్రికెట్ మ్యాచ్‌ల్లో మజా ఉండదనే స్థాయిలో అభిమానులకు చేరువయ్యారు. అంతే కాకుండా 2017 నుంచి 2021 వరకు టీమిండియా కోచ్‌గా పనిచేశాడు. కోచ్‌గా పనిచేసినందుకు పది కోట్లకుపైనే రెమ్యునరేషన్ అందుకున్నాడు.
టాపిక్