India T20 world cup squad : ఐపీఎల్ 2024 ప్రదర్శనతో వరల్డ్ కప్ టీమ్ పిక్ చేస్తే? కోహ్లీ ఔట్!
T20 world cup India squad : ఐపీఎల్ 2024 ఆధారంగా టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక చేస్తే.. ఎవరెవరికి చోటు దక్కుతుంది? ఎవరికి దక్కదు? ఇక్కడ చూద్దాము..

India squad for T20 world cup : జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్లేయర్లకు ఐపీఎల్ 2024 చాలా కీలకంగా మారింది. ఇందులో మంచి ప్రదర్శన చేసి.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకోవాలని చాలా మంది ప్లేయర్లు కృషి చేస్తున్నారు. వాస్తవానికి.. ఒక్క ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా.. టీ20 వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేయరని మనందరికి తెలుసు. కానీ.. ఒక వేళ పిక్ చేస్తే? జట్టులో ఎవరెవరు ఉంటారు? ఎవరు టీమిండియా నుంచి బయటకు వెళతారు? ఈ లిస్ట్‌పై ఓ లుక్కేద్దాము..
ఐపీఎల్ 2024 ప్రదర్శన ఆధారంగా.. టీ20 వరల్డ్ కప్ జట్టును పిక్ చేస్తే..
ఓపెనర్లు:- అభిశేక్ శర్మ, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్.
టీమిండియాలో ఓపెనింగ్ కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. చాలా మంది టఫ్ ఫైట్ ఇస్తారు. విరాట్ కోహ్లీ ఐపీఎల్లో ఓపెనింగ్ చేస్తాడు. ఈ లెక్కన అతడిని ఓపెనింగ్ స్లాట్‌కి ఎంపిక చేయాలని భావించినా.. అలా జరగకపోవచ్చు! ఐపీఎల్ 2024లో ఆరెంజ్ క్యాప్ రేస్‌లో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. విరాట్ కోహ్లీని స్ట్రైక్ రేట్ సమస్య వెంటాడుతోంది. అతను నిదానంగా పరుగులు చేస్తుండటాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. అదే సమయంలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున విధ్వంసం సృష్టిస్తున్న అభిషేక్ శర్మ మంచి ఆప్షన్ అవుతాడు. 8 ఇన్నింగ్స్‌లో 218.8 స్ట్రైక్ రేట్‌తో 288 రన్స్ చేశాడు. ఓవర్‌కు 12.38 రన్స్ చేస్తున్నాడు. 3 బాల్స్‌కి ఒక బౌండరి బాదుతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఇంతకు మించి ఏం కావాలి?
Virat Kohli T20 world cup : ఇక ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ- ఇషాన్ కిషన్‌లు పవర్‌ప్లేలో మంచి ప్రదర్శన చేస్తున్నారు. వీరిద్దరు.. ఓవరుకు 10 పరుగులు చేస్తున్నారు. ప్రతి 3.2 బాల్స్‌కి బౌండరి బాదుతున్నారు. 160 స్ట్రైక్ రేట్‌తో రోహిత్ శర్మ 311 రన్స్ చేయగా.. ఇషాన్ కిషన్ 165.62 స్ట్రైక్ రేట్‌తో 212 పరుగులు సాధించాడు.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు:- రియాన్ పరాగ్, సంజు సామ్సన్, రిషభ్ పంత్, దినేశ్ కార్తి, శశాంక్ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో 33 బాల్స్‌లో 71 పరుగులు చేసి..టీ20 వరల్డ్ కప్‌కి తనను తీసుకోవాలా వద్దా? అన్న సందేహాన్ని.. కొట్టిపారేశాడు. సంజూ సామ్సన్ చేసిన 385 రన్స్‌లో 153 పరుగులు మిడల్ ఓవర్స్ (7-16)లోనే వచ్చాయి. అతని స్ట్రైక్ రేట్ 159.38గా ఉంది.
రియాన్ పరాగ్.. 8 ఇన్నింగ్స్‌లలో 160 స్ట్రైక్ రేట్‌తో 332 రన్స్ చేశాడు. పంత్.. 43 బాల్స్‌లో 83 రన్స్ చేసి, తాను కూడా రేస్‌లో ఉన్నట్టు డిక్లేర్ చేశాడు.
IPL 2024 latest news : ఇక ఫినీషర్ అనగానే ఎంఎస్ ధోనీ గుర్తొస్తాడు. కానీ అతను ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. అతని స్థానంలో దినేశ్ కార్తి, శశాంక్‌లు టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు మంచి పిక్ అవుతారు. ఇద్దరు వరుసగా.. 253.7, 212.12 స్ట్రైక్ రేట్‌తో ఐపీఎల్ 2024 ఆఢుతున్నారు.
ఆల్ రౌండర్స్:- అక్షర్ పటేల్, శివమ్ దూబే..
చెన్నై సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివమ్ దూబే.. 196.67 స్ట్రైక్ రేట్‌తో స్పిన్నర్లను ఉతికారేస్తున్నాడు. అంతేకాదు.. 7-16 ఓవర్లలో అతని స్ట్రైక్ రేట్ 166గ ఉంది. మరోవైపు.. అక్ష పటేల్ ఈ సీజన్లో బాగా రాణిస్తున్నాడు. బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నప్పటికీ.. 7. ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. 135.35 స్ట్రైక్ రేట్‌తో 134 రన్స్ చేశాడు.
T20 world cup 2024 : ఐపీఎల్ 2024లో రవీంద్ర జడేజా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఇక హార్దిక్ పాండ్యా ప్రదర్శన కూడా అంతే! ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా చూస్తే.. వీరిని పక్కన పెట్టక తప్పదు.
బౌలర్లు:- కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సందీప్ శర్మ, నటరాజన్, యుజ్వెందర్ చాహల్.
ఈ ఐపీఎల్ 2024లో అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు జస్ప్రీత్ బుమ్రా. ఇప్పటికే 14 వికెట్లు తీశాడు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ జట్టులో బుమ్రా ప్లేస్ ఫిక్స్ అనుకోండి. అటు 13 వికెట్లతో చాహల్, 12 వికెట్లతో కుల్దీప్ కూడా రాణిస్తున్నారు. మరోవైపు.. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ.. 4 మ్యాచ్‌లలో 8 వికెట్లు తీసి అందరిని ఆకట్టుకున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్ నటరాజన్ సైతం.. ఈ సీజన్లో 11 వికెట్లు తీశాడు. మరీ ముఖ్యంగా.. డెత్ ఓవర్స్‌లో మంచి బౌలింగ్ చేస్తున్నాడు.
ఇది కేవలం.. ఐపీఎల్ 2024 ప్రదర్శన ఆధారంగానే అంచనా వేసిన టీమ్. మరి వీరిలో ఎంతమంది టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకుంటారో చూడాలి.
సంబంధిత కథనం