క్రికెట్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారిన యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ లవ్ కు ఎండ్ కార్డు పడిందా? పెళ్లి దాకా రాకుండానే వీళ్ల లవ్ బ్రేకప్ అయిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరు ఒకరి అకౌంట్ ను మరొకరు అన్ ఫాలో చేయడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు.
శుభ్‌మన్ గిల్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారా లవ్ లో ఉన్నారనే రూమర్స్ ఎప్పుడూ వైరల్ గానే ఉంటున్నాయి. ఈ ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరి అకౌంట్ ను మరొకరు ఫాలో అవుతూ.. పోస్ట్ లకు లైక్ లు కొడుతూ, కామెంట్లు చేసుకున్నారు. దీంతో వీళ్ల మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. గ్రౌండ్ లో శుభ్‌మన్ ఆడినప్పుడు కూడా ఫ్యాన్స్ సారా పేరుతో టీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఒక ఇంటర్వ్యూలో లవ్ స్టోరీ గురించి గిల్ మాట్లాడుతూ.. అది ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు అని అస్పష్టంగా చెప్పడం ద్వారా అనుమానాలకు తావిచ్చారు. ఒక విధంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని పరోక్షంగా సూచించారు. అంతేకాకుండా గిల్.. సారా టెండూల్కర్ కాదు, నటి సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి.
సడన్ గా శుభ్‌మన్, సారా లవ్ స్టోరీ ముగిసిందనే వార్తలు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో వీళ్లు అకస్మాత్తుగా అన్‌ఫాలో చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి, వారు విడిపోయారనే గందరగోళం ఏర్పడింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఈ వార్తల మధ్యలోనే ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని అద్భుతంగా గడుపుతున్నారు. గిల్ ఐపీఎల్‌లో బిజీగా ఉంటే, సారా తన ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలో నిమగ్నమై ఉంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను మూడేళ్లుగా సింగిల్ గానే ఉన్నానని శుభ్‌మన్ గిల్ వెల్లడించడం సంచలనంగా మారింది. క్రికెట్ కెరీర్ కారణంగా లవ్ చేసే టైం లేదని అతనన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకోవడం వైరల్ గా మారింది. శుభ్‌మన్ కామెంట్లే ఇందుకు కారణమనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ సారథిగా శుభ్‌మన్ గిల్ సత్తాచాటుతున్నాడు. ఆ టీమ్ 8 మ్యాచ్ ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ కు చేరువగా ఉంది.
సంబంధిత కథనం