కీ ప్లేయర్లు ఇంజూరీ కావడం.. హాస్పిటల్ వెళ్లడం.. మళ్లీ మ్యాచ్ లోకి ఎంట్రీ ఇచ్చి టీమ్ ను గెలిపించడం.. క్రికెట్ లేదా ఇతర స్పోర్ట్స్ బేస్డ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే క్లైమాక్స్ ఇదే. ఇలాంటి సీన్సే రియల్ గా క్రికెట్ గ్రౌండ్ లో కనిపించాయి. కానీ ఆ ప్లేయర్ టీమ్ ను గెలిపించలేకపోయింది. స్కాట్లాండ్ తో మ్యాచ లో స్ట్రెచర్ పై హాస్పిటల్ వెళ్లొచ్చిన వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ సెంచరీ చేసింది. కానీ ఎంతగా పోరాడినా టీమ్ ఓటమిని తప్పించలేకపోయింది.
2025 వుమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీలో స్కాట్లాండ్ తో ఛేజింగ్ లో వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ తీవ్రమైన కండరాల నొప్పితో బాధపడింది. 95 రన్స్ దగ్గర ఆమె బ్యాటింగ్ చేయలేక బయటకు వెళ్లిపోయింది. ట్రీట్ మెంట్ తీసుకుని మళ్లీ బ్యాటింగ్ కు వచ్చింది.
కానీ 99 రన్స్ దగ్గర తీవ్రమైన నొప్పితో విలవిలలాడింది. ఆమెను అప్పుడు స్ట్రెచర్ పై బయటకు తీసుకెళ్లారు. ఆ వెంటనే 9వ వికెట్ పడటంతో తప్పని పరిస్థితుల్లో హేలీ బ్యాటింగ్ కు వచ్చింది. 101 బాల్స్ లో సెంచరీ కంప్లీట్ చేసింది. కానీ గొప్పగా ఫైట్ చేసినా టీమ్ ను గెలిపించలేకపోయింది. విండీస్ విజయానికి 12 రన్స్ కావాల్సిన దశలో లాస్ట్ వికెట్ పడటంతో టీమ్ ఓడిపోయింది. ఓపెనర్ హేలీ 114 రన్స్ తో నాటౌట్ గా మిగిలింది.
లాహోర్‌లో జరిగిన 2025 మహిళల ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ బుధవారం (ఏప్రిల్ 9) అసాధారణ ప్రదర్శన చేసింది. బౌలింగ్ లోనూ అదరగొట్టింది. ఫస్ట్ బౌలింగ్ లో 4 వికెట్లు పడగొట్టింది. దీంతో స్కాట్లాండ్ 45 ఓవర్లలో 244 పరుగులకే ఆలౌటైంది.
ఛేజింగ్ లో ఓ వైపు వికెట్లు పడుతున్నా హేలీ అద్భుతంగా పోరాడింది. జైదా జేమ్స్ (45) కాసేకు హేలీకి సపోర్ట్ చేసింది. కానీ జైదా ఔట్ అయినా తర్వాత మళ్లీ టపటపా వికెట్లు పడ్డాయి. మరోవైపు హేలీ కండరాల నొప్పితో తీవ్రంగా బాధపడింది. పెయిన్ భరిస్తూనే బ్యాటింగ్ చేసింది. స్ట్రెచర్ పై హాస్పిటల్ కు వెళ్లొచ్చి మరీ పోరాడింది. కానీ లాస్ట్ బ్యాటర్ కరిష్మా ఔటవడంతో హేలీ ఫైటింగ్ వేస్ట్ అయిపోయింది.
ఒకే వన్డేలో నాలుగు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన నాలుగో వుమెన్ క్రికెటర్ గా హేలీ నిలిచింది. ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ కెప్టెన్ గా హిస్టరీ క్రియేట్ చేసింది.
సంబంధిత కథనం