Warner on Dhoni: ధోనీని మించిన ఫినిషర్ క్రికెట్ చరిత్రలోనే లేడు.. అల్లు అర్జున్‌తో రీల్ చేయాలని ఉంది: డేవిడ్ వార్నర్
Warner on Dhoni: ధోనీని మించిన ఫినిషర్ క్రికెట్ చరిత్రలోనే లేడు అంటూ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీల్ చేయాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పాడు.
Warner on Dhoni: ధోనీ గొప్ప క్రికెటర్, గొప్ప కెప్టెన్.. అంతకు మించి గొప్ప ఫినిషర్. తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా అదే చెబుతున్నాడు. ఈ మధ్యే ఇండియాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జియో సినిమాతో అతడు మాట్లాడాడు. క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ట్ ఫినిషర్ ఎవరని అడిగితే.. ధోనీయే అని వార్నర్ స్పష్టం చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
ఇండియాతో సిరీస్ లో మంచి టచ్ లో కనిపించిన వార్నర్.. ఆ సిరీస్ బ్రాడ్ కాస్టర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చాడు. క్రికెట్ కెరీర్లో తనకు స్ఫూర్తి కలిగించిన క్రికెటర్ ఎవరు అని అడగ్గా.. వార్నర్ ముగ్గురు పేర్లు చెప్పాడు. "ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, రికీ పాంటింగ్. నేను కూడాఎప్పుడూ వాళ్లు ఎలా ఆడారో అలా ఆడాలని అనుకున్నాను. నేను ఓ లెగ్ స్పిన్నర్ కావాలనుకున్నాను. గిల్‌క్రిస్ట్ డాషింగ్ ఓపెనర్. రికీ పాంటింగ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకడు" అని వార్నర్ అన్నాడు.
ఈ సందర్భంగానే క్రికెట్ హిస్టరీలో గ్రేటెస్ట్ ఫినిషర్ ఎవరు అన్న ప్రశ్నకు మరో ఆలోచన లేకుండా "నా వరకూ ఎమ్మెస్ ధోనీ" అని వార్నర్ చెప్పాడు. ధోనీ కంటే ముందు 1990ల్లో ఆస్ట్రేలియాకే చెందిన మైఖేల్ బెవాన్ బెస్ట్ ఫినిషర్ గా ఉండేవాడు. కానీ అతని పేరు కాకుండా వార్నర్.. ధోనీ చెప్పడం విశేషం. వన్డేలలో, అందులోనూ ఉత్కంఠభరిత చేజింగ్ లలో ఎన్నోసార్లు టీమ్ ను గెలిపించాడు ధోనీ.
ఇక గ్రేటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆల్ టైమ్ ట్యాగ్ మాత్రం సౌతాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్ కలిస్ కు ఇచ్చాడు వార్నర్. పాకిస్థాన్ పై తాను చేసిన ట్రిపుల్ సెంచరీ తన ఫేవరెట్ ఇన్నింగ్స్ అని చెప్పాడు. ఇక 2015 వరల్డ్ కప్ గెలవడం తన కెరీర్లో గ్రేటెస్ట్ మూమెంట్ అన్నాడు. ఇక తాను సచిన్, హేడెన్ లతో ఓపెనింగ్ చేయాలని కలలు కనేవాడినని కూడా తెలిపాడు.
అల్లు అర్జున్‌తో రీల్ చేయాలని ఉంది
ఇక టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తనకు ఓ రీల్ చేయాలని ఉందని వార్నర్ చెప్పడం విశేషం. నిజానికి బన్నీని ఇమిటేట్ చేస్తూ వార్నర్ గతంలో ఎన్నో రీల్స్ చేశాడు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ఆడుతున్న సమయంలో టాలీవుడ్ హీరోల రీల్స్ చేసేవాడు.
అందులోనూ పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ ను చాలాసార్లు ఇమిటేట్ చేశాడు. దీంతో తనకు అల్లు అర్జున్ తో కలిసి ఓ రీల్ చేయాలని ఉందని ఇదే ఇంటర్వ్యూలో వార్నర్ చెప్పాడు.