Wankhede Stadium Guinness World Record: వాంఖెడే స్టేడియం 50 ఏళ్ల సెలబ్రేషన్స్.. 14505 బాల్స్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డు
Wankhede Stadium Guinness World Record: వాంఖెడే స్టేడియం 50 ఏళ్ల సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ 50 ఏళ్ల సంబరంలో ఏకంగా 14505 బాల్స్ వినియోగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేయడం విశేషం.
Wankhede Stadium Guinness World Record: ముంబైలోని ఐకానిక్ వాంఖెడే స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. కొన్ని రోజులుగా ఈ సంబరాలను ముంబై క్రికెట్ అసోసియేషన్ ఘనంగా నిర్వహిస్తోంది. అయితే గురువారం (జనవరి 23) అతిపెద్ద క్రికెట్ బాల్ సెంటెన్స్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఈ వాక్యం కోసం ఏకంగా 14505 బంతులను వినియోగించారు.

వాంఖెడే స్టేడియం వరల్డ్ రికార్డు
ముంబైలోని వాంఖెడే స్టేడియంలో తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సంబరాలు నిర్వహిస్తోంది. 1975లో తొలిసారి వెస్టిండీస్ తో ఇండియా ఆడిన టెస్టు మ్యాచ్ జనవరి 23 నుంచి 29 వరకు జరిగింది. ఆ మ్యాచ్ లో సెంచరీ చేసిన ఏక్‌నాథ్ సోల్కర్ కు నివాళి అర్పిస్తూ ఓ గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేసింది.
"ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖెడే స్టేడియం" అనే వాక్యాన్ని ఏకంగా 14505 లెదర్ క్రికెట్ బాల్స్ ఉపయోగించి రాయడం విశేషం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బాల్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో ఫిఫ్టీ అనే పదం కోసం 1902 బంతులు, ఇయర్స్ కోసం 2831 బంతులు, ఆఫ్ కోసం 1066 బంతులు, వాంఖెడే కోసం 4990 బంతులు, స్టేడియం కోసం 3672 బంతులు, ఫుల్ స్టాప్ కోసం 44 బంతులు ఉపయోగించారు. మొత్తంగా 14505 బంతులు వాడారు.
ఆ బాల్స్ అన్నీ వాళ్లకే
ఈ వరల్డ్ రికార్డు కోసం ఉపయోగించిన బంతులను ముంబై క్రికెట్ అసోసియేషన్ నగరంలోని స్కూల్స్, క్లబ్స్, ఎన్జీవోల్లోని యువ క్రికెటర్లకు ఇవ్వనున్నారు. ఈ రికార్డు నుంచి స్ఫూర్తి పొంది వాళ్లు తమ కెరీర్లలో గొప్ప మైలురాళ్లు సాధించాలన్న ఉద్దేశంతో ఈ బాల్స్ ను వాళ్లకు ఇవ్వాలని నిర్ణయించారు. స్టేడియం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా అంతకుముందు ఎంసీఏ వివిధ ఈవెంట్లను నిర్వహించింది.
ఇందులో భాగంగా ముంబై మెన్స్, వుమెన్స్ టీమ్స్, 1974లో వాంఖెడేలో తొలిసారి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన టీమ్ సభ్యులు, స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ముంబై సభ్యులను సత్కరించారు. ముంబై నుంచి గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, రోమిత్ శర్మలాంటి గొప్ప క్రికెటర్లు ఇండియన్ టీమ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం