Virat Kohli: సౌతాఫ్రికా సిరీస్‌కు కోహ్లి దూరం - రీఎంట్రీ ఎప్పుడంటే?
Virat Kohli: డిసెంబర్‌లో టీమిండియా సౌతాఫ్రికా పర్యటించనుంది. సౌతాఫ్రికాతో వన్డే, టెస్ట్‌లతో పాటు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ సౌతాఫ్రికా సిరీస్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి దూరం కానున్నట్లు తెలిసింది.

Virat Kohli : వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లి చెలరేగి ఆడాడు. మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలతో 765 రన్స్ చేసిన కోహ్లి టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును దక్కించుకున్నాడు. ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేసినా టీమ్ ఇండియాకు కప్ మాత్రం అందించలేకపోయాడు.
వరల్డ్ కప్‌లో కోహ్లి ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిసింది. కోహ్లి గొప్ప ఆటగాడంటూ పలువురు మాజీ క్రికెటర్లు కొనియాడారు. వరల్డ్ కప్ తర్వాత సీనియర్ క్రికెటర్స్ సౌతాఫ్రికా సిరీస్ తో జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. డిసెంబర్ 10 నుంచి జనవరి 7 వరకు ఈ సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో మూడేసి వన్డేలు, టీ20 మ్యాచ్‌లతో పాటు రెండు టెస్ట్‌లను టీమిండియా ఆడనుంది.
ఈ సిరీస్‌లో వన్డేలతో పాటు టీ20 మ్యాచ్‌లకు కోహ్లి దూరం కానున్నాడు. కుటుంబపరమైన బాధ్యతల కారణంగా వన్డే, టీ20లకు తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని బీసీసీఐని కోహ్లి కోరినట్లు తెలిసింది. టెస్ట్ మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులో ఉంటానని కోహ్లి సూచించినట్లు సమాచారం. కోహ్లి ప్రతిపాదనను బీసీసీఐ అంగీకరించిందని వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లి లేకుండానే వన్డే, టీ20 టీమ్‌లను బీసీసీఐ అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.