రిటైర్మెంట్ చెప్పేశాడు.. నవ్వుతూ ముంబయి నుంచి వెళ్లిపోయాడు.. కూల్ లుక్ లో కోహ్లి.. వైఫ్ తో ఫొటోలు వైరల్-virat kohli spotted on mumbai airport with wife anushka sharma after announcing test retirement in cool look ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  రిటైర్మెంట్ చెప్పేశాడు.. నవ్వుతూ ముంబయి నుంచి వెళ్లిపోయాడు.. కూల్ లుక్ లో కోహ్లి.. వైఫ్ తో ఫొటోలు వైరల్

రిటైర్మెంట్ చెప్పేశాడు.. నవ్వుతూ ముంబయి నుంచి వెళ్లిపోయాడు.. కూల్ లుక్ లో కోహ్లి.. వైఫ్ తో ఫొటోలు వైరల్

పెద్దగా హడావుడి ఏం లేదు. టెస్టు క్రికెట్ ను వదిలేశాననే ఆలోచనతో ఆందోళన లేదు. కూల్ లుక్ లో నవ్వుతూ కనిపించాడు విరాట్. టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ తర్వాత ముంబయి విమానాశ్రయంలో భార్య అనుష్కతో ఉన్న కోహ్లి ఫొటోలు వైరల్ గా మారాయి.

భార్య అనుష్క శర్మతో విరాట్ కోహ్లి

14 ఏళ్ల పాటు భారత టెస్టు క్రికెట్ జట్టు కీలక ఆటగాడిగా కొనసాగాడు విరాట్ కోహ్లి. కెప్టెన్ గా, బ్యాటర్ గా టీమిండియాకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడు. ఇప్పుడిక టెస్టు క్రికెట్ చాలని రిటైర్మెంట్ ప్రకటించేశాడు. సోమవారం (మే 12) అఫీషియల్ గా అనౌన్స్ చేసేశాడు. సోషల్ మీడియాలో ఈ అనౌన్స్ మెంట్ చేసిన కొన్ని గంటలకే భార్య అనుష్క శర్మతో కలిసి నవ్వుతూ కనిపించాడు కోహ్లి.

ఎయిర్ పోర్ట్ లో జోడీ

ఇన్‌స్టాగ్రామ్‌లో టెస్టు రిటైర్మెంట్ పోస్టు చేసి షాకిచ్చాడు విరాట్ కోహ్లి. సోమవారం ఈ పోస్టు పెట్టాడు. ఆ తర్వాత కొన్ని గంటలకే ముంబయి ఎయిర్ పోర్ట్ లో భార్య అనుష్క శర్మతో కలిసి కనిపించాడు. టెస్టు రిటైర్మెంట్ ప్రకటన తర్వాత కోహ్లి బయట కనిపించడం ఇదే తొలిసారి. దీంతో కోహ్లి ఏదో హడావుడిగా వెళ్లిపోతారేమో అనుకున్నారు.

కానీ ఎంతో కూల్ గా అనుష్క తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు కోహ్లి. నవ్వుతూ లోపలికి వెళ్లిపోయాడు. ముంబయి నుంచి వేరే ప్రాంతానికి విమానంలో వెళ్లిపోయింది ఈ జంట.

కూల్ లుక్ లో

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ఎయిర్ పోర్టులో ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. ఈ సారి ఈ జంట విమానాశ్రయంలోకి నేరుగా వెళ్ళలేదు. తొందరగా వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. విరాట్, అనుష్క లోపలికి వెళ్లే ముందు కెమెరాలకు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. విరాట్ తెల్లటి టీ-షర్ట్, బీజ్ ట్రౌజర్స్ ధరించగా.. అనుష్క రంగురంగుల చొక్కా, జీన్స్‌తో కూల్ లుక్ లో కనిపించింది.

14 ఏళ్ల కెరీర్

ఇంగ్లాండ్ పర్యటనకు నెల రోజుల ముందు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ శర్మ బాటలోనే సాగిన 36 ఏళ్ల కోహ్లి సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను తన అభిమానులతో పంచుకున్నారు.

“నేను మొదటిసారి టెస్ట్ క్రికెట్‌లో బ్యాగీ బ్లూ ధరించి 14 సంవత్సరాలైంది. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్ నన్ను ఈ ప్రయాణంలోకి తీసుకెళ్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది. నన్ను మార్చింది. నాకు జీవిత పాఠాలను నేర్పింది. వైట్ జెర్సీలో ఆడటమన్నది నాకెంతో పర్సనల్.

నా వంతు కృషి చేశా. నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ నాకు తిరిగి ఇచ్చింది. కృతజ్ఞతతో నిండిన హృదయంతో నేను వెళ్లిపోతున్నా... 269కి సైన్ ఆఫ్’’ అని కోహ్లి పోస్టులో రాసుకొచ్చారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం