భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ గత నెల 12న తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక హృదయపూర్వక నోట్‌ను పోస్ట్ చేస్తూ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలుసు కదా. అతని రిటైర్మెంట్ వార్త అభిమానులను షాక్ కు గురి చేసింది. అతని సడెన్ రిటైర్మెంట్ వెనుక అసలు కారణమేంటన్న చర్చ కూడా కొనసాగింది. దీనిపై తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించాడు.
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై రవిశాస్త్రి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)పై విమర్శలు గుప్పించాడు. ఈ విషయంలో బోర్డు మరింత మెరుగ్గా వ్యవహరించాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ తాను ఉండి ఉంటే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన వెంటనే కోహ్లిని కెప్టెన్ ను చేసేవాడినని శాస్త్రి అనడం గమనార్హం.
"అతడు అకస్మాత్తుగా వెళ్ళిపోయినందుకు నాకు బాధగా ఉంది. ఇది సడెన్ గా జరిగింది. దీనిని మరింత మెరుగ్గా పరిష్కరించి ఉండొచ్చు. బహుశా అతనితో మాట్లాడటం ద్వారా కావచ్చు. నేను ఉండి ఉంటే, ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వెంటనే అతన్ని కెప్టెన్‌గా చేసి ఉండేవాడిని" అని శాస్త్రి అన్నాడు.
"విరాట్ టెస్ట్ మ్యాచ్‌ల నుండి తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది బాధాకరం. ఎందుకంటే అతను గొప్ప ఆటగాడు. చాలా గొప్ప ఆటగాడు. ఓ ప్లేయర్ వెళ్లిపోయిన తర్వాతే అతడు ఎంత గొప్ప ఆటగాడు అన్నది అభిమానులు నిజంగా గ్రహిస్తారు. గణాంకాలు వాళ్లకు న్యాయం చేయవు. అతను తనను తాను ఎలా నిరూపించుకున్నాడు.
ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో, ముఖ్యంగా విదేశాలలో అద్భుతంగా రాణించాడు. లార్డ్స్‌లో అతను ఎలా ఆడాడు, అతని టీమ్ ఎలా అద్భుతాలు చేసింది. అసలు అది ఊహకందనిది. నేను అందులో భాగమైనందుకు సంతోషిస్తున్నాను" అని శాస్త్రి సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ చెప్పాడు.
విరాట్ కోహ్లీ 2011లో వెస్టిండీస్‌పై తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో, 36 ఏళ్ల కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌లో 210 ఇన్నింగ్స్‌లు ఆడి, 9,230 పరుగులు సాధించాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 254 నాటౌట్. అతను ఆడిన 123 మ్యాచ్‌లలో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు బాదాడు. రెడ్-బాల్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన 4వ ఆటగాడిగా నిలిచాడు.
అందరు ప్రత్యర్థులలో అతను ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు సాధించాడు. కంగారూలపై అతను 2,232 పరుగులు చేయడం విశేషం. 2018 సంవత్సరం అతనికి అత్యుత్తమంగా నిలిచింది. ఆ ఏడాది కోహ్లీ 1,322 పరుగులు సాధించాడు. ఇది ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అతను సాధించిన అత్యధిక స్కోరు.
సంబంధిత కథనం