Virat Kohli : విరాట్ కోహ్లీ గల్లీ క్రికెట్ టీమ్‌లో నలుగురు స్టార్ ప్లేయర్స్..
Virat Kohli gully cricket team : విరాట్ కోహ్లీ.. తన గల్లీ క్రికెట్ టీమ్‌లో నలుగురు టాప్ ప్లేయర్స్‌ని పిక్ చేసుకున్నాడు. వారి పేర్లను ఇక్కడ చూద్దాము..

Virat Kohli gully cricket team : ఇప్పుడు క్రికెట్ లవర్స్ అందరు.. ఐపీఎల్ 2024 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మ్యాచ్‌కి ముందు.. తన ఎక్స్‌ప్లోజివ్ గల్లీ క్రికెట్ టీమ్‌ని పిక్ చేసుకున్నాడు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ! 'మీ గల్లీ క్రికెట్ టీమ్‌లో నలుగురిని పిక్ చేసుకోవాలంటే.. ఎవరిని ఎంచుకుంటారు?' అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ గల్లీ క్రికెట్ టీమ్ ఇదే..
"మీ గల్లీ క్రికెట్ టీమ్ కోసం మీతో పాటు ఇంకో నలుగురిని ఎంచుకోండి. ఆ టీమ్‌లో ఒక వికెట్ కీపర్, ఒక బౌలర్, ఒక బ్యాటర్ ఉండాలి" అన్న ప్రశ్నకు బాగా ఆలోచించిన కోహ్లీ.. "నేను ఏబీ డి విలియర్స్, జస్ప్రీత్ బుమ్రా, ఆండ్రూ రసెల్, రషీద్ ఖాన్‌లను ఎంచుకుంటాను," అని జవాబిచ్చాడు.
ఈ నలుగు ప్లేయర్స్ కూడా నాలుగు వేరువేరు ఫ్రాంఛైజ్లకు చెందినవారే. పైగా వీరందరు స్టార్ ప్లేయర్సే. ఏబీడీ- ఆర్సీబీ తరఫున అనేక ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆల్ రౌండర్ ఆండ్రూ రసెల్ విధ్వంసం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లదు. జస్ప్రీత్ బుమ్రా, రషీద్ ఖాన్లు వరల్డ్ క్లాస్ టాప్ బౌలర్లు!
Virat Kohli IPL 2024 : ఇక ఐపీఎల్ 2024 విషయానికొస్తే.. విరాట్ కోహ్లీ పరుగుల వరద కొనసాగుతోంది. 13 మ్యాచ్‌లలో 661 రన్స్ చేసి ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేస్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు కోహ్లీ. అతని స్ట్రైక్ రేట్ 155. మరీ ముఖ్యంగా.. గత కొన్ని మ్యాచ్‌లలో అయితే.. ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. తన స్ట్రైక్ రేట్‌ని విమర్శిస్తున్న వారికి గట్టు జవాబిచ్చాడు.
ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే.. ప్లేఆఫ్స్‌కి చేరేదెవరు?
ఐపీఎల్ 2024లో మరో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా.. శనివారం రాత్రి 7:30 నిమిషాలకు చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. సాధారణంగానే.. ఈ రెండు జట్లు పోటీపడుతుంటే.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉంటాయి. అలాంటిది.. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ కోసం ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం మారడంతో.. హైఓల్టేజ్ యాక్షన్ తప్పదని క్రికెట్ లవర్స్ భావిస్తున్నారు. అంత బాగానే ఉంది కానీ.. ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉండటమే ఐపీఎల్ ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురి చేస్తోంది. మరి.. వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే? ఐపీఎల్ 2024లో సీఎస్కే, ఆర్సీబీ ప్లేఆఫ్స్ పరిస్థితేంటి?
Virat Kohli latest news : రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్కే ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి.. 7 గెలిచి, 6 ఓడిపోయింది. పాయింట్లు 14. ఇక ఫాఫ్ డూప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సీబీ.. 6 విజయాలు, 7 పరాజయాలతో మొత్తం 12 పాయింట్స్ సంపాదించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం