Virat Kohli: శుభ్‌మన్ గిల్ ఇంకా స్కూల్లోనే.. ప్రధానిగా మన్మోహన్.. కోహ్లి చివరిగా దేశవాళీ క్రికెట్ ఆడింది అప్పుడే మరి..-virat kohli last played domestic cricket 12 years back when shubman gill was in school manmohan was pm ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: శుభ్‌మన్ గిల్ ఇంకా స్కూల్లోనే.. ప్రధానిగా మన్మోహన్.. కోహ్లి చివరిగా దేశవాళీ క్రికెట్ ఆడింది అప్పుడే మరి..

Virat Kohli: శుభ్‌మన్ గిల్ ఇంకా స్కూల్లోనే.. ప్రధానిగా మన్మోహన్.. కోహ్లి చివరిగా దేశవాళీ క్రికెట్ ఆడింది అప్పుడే మరి..

Hari Prasad S HT Telugu
Jan 08, 2025 02:28 PM IST

Virat Kohli: విరాట్ కోహ్లి చివరిసారి డొమెస్టిక్ క్రికెట్ ఆడింది ఎప్పుడో తెలుసా? అప్పటికి స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ ఇంకా స్కూల్లోనే ఉన్నాడు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మన స్టార్ దేశవాళీ క్రికెట్ ముఖం కూడా చూడలేదంటే నమ్మగలరా?

శుభ్‌మన్ గిల్ ఇంకా స్కూల్లోనే.. ప్రధానిగా మన్మోహన్.. కోహ్లి చివరిగా దేశవాళీ క్రికెట్ ఆడింది అప్పుడే మరి..
శుభ్‌మన్ గిల్ ఇంకా స్కూల్లోనే.. ప్రధానిగా మన్మోహన్.. కోహ్లి చివరిగా దేశవాళీ క్రికెట్ ఆడింది అప్పుడే మరి.. (PTI)

Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతటి స్టార్ ప్లేయర్ అయినా.. ఫామ్ కోల్పోతే వెంటే డొమెస్టిక్ క్రికెట్ వైపే చూస్తాడు. అక్కడికి వెళ్లి కాస్త పరుగులు సాధించి, ఫామ్ లోకి వచ్చి మళ్లీ నేషనల్ టీమ్ తలుపు తడతాడు. కానీ మన టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మాత్రం దేశవాళీ క్రికెట్ అంటే నామోషీగా ఫీలవుతారు. కోహ్లి చివరిసారి 2012లో దేశవాళీ క్రికెట్ లో ఆడితే.. రోహిత్ శర్మ 2016 తర్వాత మళ్లీ ఆడలేదు.

yearly horoscope entry point

కోహ్లి, రోహిత్.. ఎందుకిలా?

గతేడాది బీసీసీఐ కార్యదర్శిగా జై షా ఉన్నప్పుడు ప్రతి ప్లేయర్ కు ఓ వార్నింగ్ ఇచ్చాడు. ఎంతటి వాళ్లయినా డొమెస్టిక్ క్రికెట్ లో కచ్చితంగా ఆడాల్సిందే అని, ఆడలేకపోతే దానికి సరైన కారణం చూపాలని స్పష్టం చేశారు. కానీ ఆ వార్నింగ్ కోహ్లి, రోహిత్ లాంటి ప్లేయర్స్ కు మాత్రం పని చేయడం లేదు. తమనుతాము స్టార్లుగా భావించే వీళ్లు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నా.. దేశవాళీ క్రికెట్ వైపు మాత్రం చూడటం లేదు.

కోహ్లి అయితే 2012 తర్వాత మళ్లీ డొమెస్టిక్ క్రికెట్ ముఖం కూడా చూడలేదు. అంటే ఇప్పటి స్టార్ ఇండియన్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అప్పటికి ఇంకా స్కూల్లోనే ఉన్నాడు. రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లి చివరిగా అక్టోబర్ 2013లో ఆడాడు. అదే సచిన్ టెండూల్కర్ కు చివరి రంజీ మ్యాచ్ కావడం విశేషం. ఆ తర్వాత విరాట్ కొన్నేళ్ల పాటు ఫామ్ కోల్పోయినా మళ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడి గాడిలో పడే ప్రయత్నం చేయలేదు.

మిగిలిన ప్లేయర్స్ కూడా అంతే..

కోహ్లి ఒక్కడే కాదు.. టీమిండియాలోని మిగిలిన స్టార్లు కూడా అంతే. కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికి వస్తే.. అతడు 2016లో చివరిసారి ముంబై తరఫున ఆడాడు. ఇక మన సిరాజ్ కూడా హైదరాబాద్ తరఫున 2020 తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ 2020 తర్వాత గతేడాది ఒకే ఒక్క దులీప్ ట్రోఫీ మ్యాచ్ లో ఆడారు. కోహ్లి, రోహిత్, అశ్విన్, బుమ్రా, సిరాజ్, గిల్ లాంటి ప్లేయర్స్ కు ఈ టోర్నీ నుంచి మినహాయింపు ఇచ్చారు.

అంతర్జాతీయ క్రికెట్ లో వీళ్లు ఈ స్థాయిలో రాణిస్తున్నారంటే అంతకుముందు దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటడమే కారణమన్న విషయాన్ని ఈ స్టార్లు మరచిపోతున్నారు. ఫామ్ కోల్పోయిన సందర్భాల్లో తిరిగి గాడిలో పడటానికి ఇంతకు మించిన దారి మరొకటి లేదని కూడా వాళ్లు గుర్తించడం లేదు.

టీమిండియా మ్యాచ్ లు ఉంటేనే ఫీల్డ్ లోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. శ్రీలంకలో వన్డే సిరీస్, స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనుభవాలు ఇవే చెబుతున్నాయి.

అందుకే టీమ్ లో స్టార్ స్టేటస్ అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడే బాగుపడుతుందని గవాస్కర్ లాంటి మాజీ క్రికెటర్లు పదే పదే చెబుతున్నారు. కోహ్లియే కాదు ఎంతటి ప్లేయర్ అయినా అంతర్జాతీయ క్రికెట్ లేని సమయంలో దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అన్న నిబంధన విధించాలని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా బీసీసీఐ దీనిపై దృష్టి సారిస్తుందా లేదా అన్నది చూడాలి.

Whats_app_banner