రీసెంట్ గా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పి షాకిచ్చాడు విరాట్ కోహ్లి. ఆ తర్వాత ఐపీఎల్ తిరిగి అడుగుపెట్టాడు. కోహ్లి మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ మే 17న బెంగళూరులో కేకేఆర్ తో ఆర్సీబీ మ్యాచ్ వర్షంతో రద్దయింది. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ కోహ్లీని చూసే ఛాన్స్ వచ్చింది.
శుక్రవారం (మే 23) లక్నోలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆర్సీబీ తలపడుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. గాయం నుంచి కెప్టెన్ రజత్ పటీదార్ పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్ కు జితేశ్ శర్మ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
ఇప్పటికే ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరింది. ఇక ఆ టీమ్ టాప్-2 ప్లేస్ పై కన్నేసింది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్ ల్లో 8 విజయాలతో ఉంది. ఓ మ్యాచ్ వర్షంతో రద్దయింది. దీంతో 17 పాయింట్లతో టేబుల్లో సెకండ్ ప్లేస్ లో ఉంది. సన్ రైజర్స్ పై ఈ రోజు గెలిస్తే టాప్ ప్లేస్ కు వెళ్తుంది ఆర్సీబీ.
టెస్టు క్రికెట్ కు కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫ్యాన్స్ అతనికి గొప్పగా ట్రిబ్యూట్ ఇద్దామని అనుకున్నారు. అందుకే కేకేఆర్ తో ఆర్సీబీ మ్యాచ్ కోసం చిన్నస్వామి స్టేడియానికి ఫ్యాన్స్ పోటెత్తారు. కోహ్లి పేరుతో వైట్ జెర్సీలో వేసుకుని వచ్చారు. కానీ వర్షంతో ఆ మ్యాచ్ రద్దయింది. మరి ఇప్పుడు సన్ రైజర్స్ తో మ్యాచ్ లో కోహ్లి ఏం చేస్తాడోనన్న ఆసక్తి నెలకొంది.
కోహ్లి కోసం ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తుతున్నారు. మరోవైపు ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి దూసుకెళ్తున్నాడు. 11 మ్యాచ్ ల్లో 505 పరుగులు చేశాడు విరాట్. ఈ సీజన్ లో అత్యధికంగా ఏడు హాఫ్ సెంచరీలు బాదాడు. అద్భుతమైన నిలకడ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు సన్ రైజర్స్ పైనా చెలరేగాలని చూస్తున్నాడు.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి దారుణంగా మారింది. గతేడాది ఐపీఎల్ లో హైదరాబాద్ అదరగొట్టింది. ధనాధన్ బ్యాటింగ్ తో రికార్డులు తిరగరాసింది. కానీ ఐపీఎల్ 2025 వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఘోరంగా విఫలమైంది.
12 మ్యాచ్ ల్లో 4 మాత్రమే గెలిచింది సన్ రైజర్స్. 7 ఓడింది. ఓ మ్యాచ్ వర్షంతో రద్దయింది. 9 పాయింట్లతో టేబుల్ లో 8వ ప్లేస్ లో ఉంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి పరువు కాపాడుకోవాలని సన్ రైజర్స్ చూస్తోంది.
సంబంధిత కథనం