2011 వరల్డ్ కప్ జట్టులోని 15 మంది ఆటగాళ్ల వీడ్కోలు.. రిటైర్‌మెంట్ చేయని ఒకే ఒక్కడు ఈ క్రికెటర్.. ఎవరో కనిపెట్టారా?-virat kohli is one and only active player only from 2011 world cup indian team after piyush chawla retirement ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  2011 వరల్డ్ కప్ జట్టులోని 15 మంది ఆటగాళ్ల వీడ్కోలు.. రిటైర్‌మెంట్ చేయని ఒకే ఒక్కడు ఈ క్రికెటర్.. ఎవరో కనిపెట్టారా?

2011 వరల్డ్ కప్ జట్టులోని 15 మంది ఆటగాళ్ల వీడ్కోలు.. రిటైర్‌మెంట్ చేయని ఒకే ఒక్కడు ఈ క్రికెటర్.. ఎవరో కనిపెట్టారా?

Sanjiv Kumar HT Telugu

2011 వరల్డ్ కప్ విజేత జట్టు టీమిండియాలోని సుమారు 14 మంది ఆటగాళ్లు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. రీసెంట్‌గా పీయూష్ చావ్లా రిటైర్‌మెంట్‌తో ఆ సంఖ్య 15కి చేరింది. కానీ, ఒకే ఒక్కడు మాత్రం వీడ్కోలు పలకకుండా భారత జట్టులో క్రియాశీలకంగా ఉన్నాడు. వన్డే క్రికెట్‌లో దూసుకుపోతున్నాడు.

2011 వరల్డ్ కప్ జట్టులోని 15 మంది ఆటగాళ్ల వీడ్కోలు.. రిటైర్‌మెంట్ చేయని ఒకే ఒక్కడు ఈ క్రికెటర్.. ఎవరో కనిపెట్టారా? (Getty)

పద్నాలుగేళ్ల క్రితం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2011 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకోవడం దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యంత భావోద్వేగ క్షణాల్లో ఒకటిగా నిలిచింది. అప్పటి విజేత జట్టు నుంచి మొత్తంగా 15 మంది క్రికెటర్స్ అన్ని రకాల ఆటల నుంచి వీడ్కోలు పలికారు.

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు

రీసెంట్‌గా పీయూష్ చావ్లా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. దీంతో 15 మందితో కూడిన ఆ జట్టు ఇప్పుడు క్రికెట్‌లో లేకపోయింది. అయితే, ఒకే ఒక్కడు మాత్రం ఇప్పటికీ భారత జట్టులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. వన్డే క్రికెట్‌లో ఆ 36 ఏళ్ల స్టార్ బ్యాట్స్‌మెన్ దూసుకుపోతున్నాడు.

అత్యంత యువ ఆటగాడిగా

అతను ఎవరో కాదు కింగ్ విరాట్ కోహ్లీ. 2011 వరల్డ్ కప్‌లో టీమిండియా జట్టులో అత్యంత యువ ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. అప్పటి నుంచి భారత క్రికెట్‌లో ఓ శక్తిగా మారాడు. వరల్డ్ కప్‌లో పెద్దగా ఎక్స్‌పీరియెన్స్ లేని విరాట్ కోహ్లీ తన మొదటి మ్యాచ్‌లో సెంచరీ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో

అప్పటి నుంచి పరుగుల కింగ్‌గా, చేజింగ్ మాస్టర్‌గా ఇండియన్ క్రికెట్‌కు బ్రాండ్‌ అయ్యాడు. ఇదిలా ఉంటే, మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో చారిత్రాత్మక ప్రపంచ కప్ విజేగా నిలిచిన భారత జట్టులో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా వంటి దిగ్గజాలు ఎప్పుడో ఆటకు దూరమయ్యారు.

సీఎస్‌కేకు సేవలు

అలాగే, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, హర్భజన్ సింగ్, శ్రీశాంత్, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ అంతా రిటైర్‌మెంట్ ప్రకటించారు. వీరిలో కొందరు కోచ్‌లుగా, వ్యాఖ్యాలలుగా కొనసాగుతున్నారు. ఇక ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఐపీఎల్‌లో సీఎస్‌కేకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ

ఇక రీసెంట్‌గా జూన్ 6న పీయుష్ చావ్లా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. స్పిన్నర్‌గా చేరిన పీయూష్ చావ్లా కెరీర్‌లో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. ఐపీల్‌లో అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇక పీయుష్ చావ్లా వీడ్కోలుతో 2011 ప్రపంచకప్ జట్టు గెలిచిన టీమిండియా నుంచి 15 మంది రిటైర్ అయ్యారు.

వన్డేల్లో కొనసాగుతూ

వీరందరిలో ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే మిగిలాడు. అయితే, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగుతాడు. దీంతో 2011 వరల్డ్ కప్ టీమిండియా జట్టు నుంచి ఇప్పటికీ క్రికెట్‌లో యాక్టివ్‌గా ఉన్న ఒకే ఒక్క ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం