virat kohli hug: లేడీ ఫ్యాన్ కు విరాట్ హగ్.. సంతోషంలో తేలిపోయిన అమ్మాయి.. ఎంతో లక్కీ అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్
virat kohli hug: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ లేడీ ఫ్యాన్ ను హగ్ చేసుకున్నాడు. భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ లో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి హత్తుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ అమ్మాయి లక్కీ అంటూ కామెంట్లు.

విరాట్ హగ్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి షేక్ హ్యాండ్ కోసం ఫ్యాన్స్ పోటీపడుతుంటారు. ఒక్కసారైనా అతణ్ని కలవాలని ఎదురు చూస్తారు. అలాంటిది ఓ మహిళా అభిమాని ఏకంగా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అహ్మదాబాద్ లో మూడో వన్డే కోసం భువనేశ్వర్ నుంచి టీమ్ఇండియా బయల్దేరింది. ఈ క్రమంలో ఎయిర్ పోర్టులో లేడీ ఫ్యాన్ ను కోహ్లి హగ్ చేసుకున్నాడు.
వీడియో వైరల్
భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ లో మహిళా అభిమానిని విరాట్ హగ్ చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. సహచర ఆటగాళ్లతో కలిసి నడుచుకుంటూ వస్తున్న కోహ్లి తన కోసం వచ్చిన ఫ్యాన్స్ వైపు చూశాడు. ట్రాలీని వదిలేసి వాళ్ల దగ్గరకు వెళ్లి ఓ అమ్మాయిని హగ్ చేసుకున్నాడు. అక్కడ ఉన్నవాళ్లందరూ కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కొంతమందికి షేక్ హ్యాండ్ ఇచ్చిన కోహ్లి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కోహ్లి కోహ్లి
బ్యాటింగ్ లో కోహ్లి ఇటీవల చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నా అతని ఫ్యాన్ బేస్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. కోహ్లి ని చూసేందుకు జనాలు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. ఇటీవల కోహ్లి రంజీ మ్యాచ్ లో ఆడితే ఆ స్టేడియానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరైన సంగతి తెలిసిందే. కోహ్లి ఎక్కడ ఆడినా ఫ్యాన్స్ లైన్లు కడతారు. ఇక బయట కనిపించినా కోహ్లీని కలిసేందుకు ఎగబడతారు.
ఫామ్ లోకి రావాలని
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కోహ్లి ఫామ్ లోకి రావాలని అటు టీమ్ మేనేజ్ మెంట్, ఇటు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మోకాలి వాపుతో ఇంగ్లండ్ తో తొలి వన్డేకు దూరమైన విరాట్.. రెండో వన్డేలో ఆడినా అయిదు పరుగులే చేశాడు. దీంతో బుధవారం (ఫిబ్రవరి 12) జరిగే మూడో వన్డేలో అతను తిరిగి ఫామ్ అందుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
సంబంధిత కథనం