Kohli: రంజీల్లోకి కోహ్లి రీఎంట్రీ - కిక్కిరిసిన స్టేడియం - రెండు కిలోమీటర్ల క్యూలైన్ - ఫ్యాన్స్‌కు గాయాలు!
దాదాపు పన్నెండేళ్ల విరామం తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి విరాట్ కోహ్లి రీ ఎంట్రీ ఇచ్చాడు. రైల్వేస్‌తో జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు. కోహ్లిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివచ్చారు.
Kohli: దాదాపు పన్నెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రంజీ ట్రోఫీలోకి విరాట్ కోహ్లి రీఎంట్రీ ఇచ్చాడు. గురువారం నుంచి రైల్వేస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సొంత జట్టు ఢిల్లీ తరఫున కోహ్లి బరిలోకి దిగాడు. అతడికి అభిమానులు ఘనంగా వెల్కమ్ చెప్పారు. కోహ్లిని చూసేందుకు అరుణ్ జైట్లీ స్టేడియానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొలిరోజు దాదాపు పదివేల మందికిపైగా ఫ్యాన్స్ మ్యాచ్‌కు హాజరైనట్లు తెలిసింది . ఆర్‌సీబీ, కోహ్లి నినాదాలతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.

రెండు కిలోమీటర్ల మేర క్యూ..,.
రంజీ మ్యాచ్ ప్రారంభానికి రెండు, మూడు గంటల ముందే స్టేడియం ముందు అభిమానులు భారీగా క్యూ కట్టారు. క్యూలైన్ రెండు కిలోమీటర్లను దాటేయడం గమనార్హం. స్టేడియం లోపలికి వచ్చే టైమ్‌లో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు అభిమానులు గాయపడినట్లు తెలుస్తోంది. అలాగే ఓ పోలీస్ బైక్ కూడా ధ్వంసం అయినట్లు సమాచారం.
భద్రత కట్టుదిట్టం అయినా...
కోహ్లి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసింది ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్. ఎక్స్‌ట్రా ఫోర్స్‌ను రంగంలోకి దించినట్లు సమాచారం. అభిమానుల ఎంట్రీ కోసం కోసం మూడు గేట్లు మాత్రమే ఓపెన్ చేశారు . గేట్ నంబర్ 16 ను సిబ్బంది ఓపెన్ చేయగానే లోపలికి వెళ్లేందుకు వందల సంఖ్యలో ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగినట్లు చెబుతోన్నారు. ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేసే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది కూడా గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
20 పరుగులకే మూడు వికెట్లు...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోనీ రైల్వేస్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. కోహ్లి ఫీల్డింగ్ చేస్తోన్న టైమ్‌లో ఆర్‌సీబీ, కోహ్లి నినాదాలు చేస్తూ అభిమానులు కనిపించారు. ఈ మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
బ్యాటింగ్ ప్రాక్టీస్...
మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన కోహ్లి రంజీ మ్యాచ్‌లో ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. రంజీ ట్రోఫీ కోసం కోహ్లి నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. కోహ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
టాపిక్