Virat Kohli: ఏదో అనుకుంటే..? - రంజీ మ్యాచ్‌లో కోహ్లి ఫ్లాప్ షో - దెబ్బకు ఫేమస్ అయిన రైల్వేస్ బౌలర్!
Virat Kohli: రంజీ మ్యాచ్‌లో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్‌కే ఔటయ్యాడు. పదిహేను బాల్స్ ఎదుర్కొన్న కోహ్లి ఆరు పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లి ఔట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Virat Kohli: రంజీ మ్యాచ్‌లో కోహ్లి వీరవిహారాన్ని చూడాలని వచ్చిన అభిమానులకు నిరాశే మిగిలింది. తన ఫ్లాప్ షోను కంటిన్యూ చేస్తూ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కోహ్లి క్రీజులో ఉన్నంత వరకు ఫుల్ క్రౌడ్‌తో కిక్కిరిసిన అరుణ్ జైట్లీ స్టేడియం ...అతడు ఔట్ అయిన తర్వాత మొత్తం ఖాళీగా మారింది. కోహ్లి ఔట్ అయిన వెంటనే ఫ్యాన్స్ స్టేడియం నుంచి వెళ్లిపోయారు. కోహ్లిని ఔట్ చేసిన రైల్వేస్ పేసర్ హిమాన్షు సాంగ్వాన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

నాలుగో స్థానంలో...
యశ్ ధుల్ ఔట్ అయిన తర్వాత తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగాడు కోహ్లి. పదిహేను బాల్స్ ఎదుర్కొన్న కోహ్లి కేవలం ఆరు రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. ఫోర్ కొట్టి క్రీజులో కుదురుకున్నట్లే కనిపించాడు. హిమాన్షు సాంగ్వాన్ వేసిన బాల్‌ను డిఫెన్స్ ఆడాలని కోహ్లి ప్రయత్నించాడు. బాల్‌ను అంచనా వేయడంలో కోహ్లి విఫలం కావడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆఫ్ స్టంప్ ఎగిరి పడింది కోహ్లిని ఔట్ చేసిన సాంగ్వాన్ సంబరాలు చేసుకున్నాడు. కోహ్లి ఔట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరీష్ సాంగ్వాన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దెబ్బకు అతడు హీరోగా మారిపోయాడు.
ఆనందం కొద్ది క్షణాలే...
దాదాపు పన్నెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత కోహ్లి రంజీ మ్యాచ్ ఆడుతోండటంతో అతడి బ్యాటింగ్ చూడాలని వచ్చిన అభిమానుల ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. కోహ్లి బ్యాటింగ్ చూసేందుకు అరుణ్ జైట్లీ స్టేడియానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పదిహేను వేలకుపైనే ఫ్యాన్స్ మ్యాచ్‌కు హాజరైనట్లు సమాచారం. కోహ్లి ఔట్ అయినా వెంటనే దాదాపు స్టేడియం మొత్తం ఖాళీగా మారిపోయింది. అరుణ్ జైట్లీ స్టేడియం నుంచి ఫ్యాన్స్ వెళ్లిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
రోహిత్, రాహుల్ కూడా...
టీమీండియా క్రికెటర్లు రంజీ మ్యాచ్ ఆడాల్సిందేనని ఇటీవలే బీసీసీఐ రూల్ పెట్టింది. ఈ రూల్ కారణంగా కోహ్లితో పాటు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పంత్, కేఎల్ రాహుల్‌తో పాటు మిగిలిన స్టార్ ప్లేయర్లు రంజీ ట్రోఫీలోకి బరిలోకి దిగారు. కానీ ఒక్కరు కూడా భారీ స్కోర్లు చేయలేకపోయారు. రంజీ ట్రోఫీలో విఫలమైన టీమిండియా స్టార్లపై క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
టాపిక్