ఐపీఎల్ 2025 మొదలై అప్పుడే వారం అయ్యింది. ఈ సారి ఐపీఎల్‌లో బ్యాటర్లదే అధిపత్యం కనిపిస్తోంది. సింగిల్స్, డబుల్స్ కంటే సిక్సర్లు, ఫోర్లతో బ్యాటర్లు వీరవిహారం చేస్తోన్నారు. ఈ ఫస్ట్ వీక్‌లో ఏ మాత్రం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు అరదగొట్టగా...పలువురు స్టార్ క్రికెటర్లు మాత్రం తుస్ మనిపించారు.
ఐపీఎల్‌కు ముందు విఘ్నేష్ పుతుర్ పేరు ఎవరికి తెలియదు. కానీ ఒక్క మ్యాచ్‌తోనే హీరోగా మారాడు ఈ ముంబై బౌలర్. చెన్నైతో జరిగిన మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్పిన్నర్ తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసుకున్నాడు. క్రికెట్ దిగ్గజాల మనసులను గెలుచుకున్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. కానీ అనికేత్ వర్మ మాత్రం ఇన్నింగ్స్ మాత్రం ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగిన అనికేత్ కేవలం పదమూడు బాల్స్‌లోనే 36 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు ఉన్నాయి. 276 స్ట్రైక్ రేట్‌తో దంచికొట్టాడు. అనికేత్ వర్మను ఐపీఎల్ మెగా వేలంలో 30 లక్షలకు సన్‌రైజర్స్ దక్కించుకున్నది.
ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి దశలో ఉన్న ఢిల్లీ ఒక్క వికెట్ తేడాతో అనూహ్య విజయాన్ని అందుకుందంటే వీరిద్దరే కారణం. ఈ మ్యాచ్‌లో అశుతోష్ శర్మ 31 బాల్స్‌లో 66 పరుగులు చేయగా...విప్రజ్ నిగమ్ 15 బాల్స్‌లో 39 రన్స్ చేశాడు. వీరితో పాటు మరో పంజాబ్ అన్‌క్యాప్‌డ్ క్రికెటర్ ప్రియాన్ష్ ఆర్య కూడా మెరిశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఆరంభ పోరులో 23 బాల్స్‌లోనే ప్రియాన్ష్ 47 రన్స్ చేశాడు.
ఐపీఎల్ 2025లో కోట్లు పెట్టి కొన్న స్లార్ ఆటగాళ్లు మాత్రం తుస్ మనిపిస్తోన్నారు. 27 కోట్లతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన పంత్ రెండు మ్యాచుల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఓ మ్యాచ్‌లో డకౌట్ కాగా...మరో మ్యాచ్‌లో 15 బాల్స్‌లో 15 రన్స్ చేసి నిరాశపరిచాడు. నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్, యశస్వి జైస్వాల్‌తో పాటు మరికొందరు క్రికెటర్లు అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయారు.
సంబంధిత కథనం