india vs england 2nd odi: అరంగేట్రంలో వరుణ్ కు తొలి వికెట్.. ఇంగ్లండ్ ఫస్ట్ వికెట్ డౌన్.. డకెట్ హాఫ్ సెంచరీ
india vs england 2nd odi: ఇంగ్లండ్ తో రెండో వన్డేలో భారత్ కు తొలి వికెట్ దక్కింది. అరంగేట్ర స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫిల్ సాల్ట్ ను ఔట్ చేశాడు. మరోవైపు డకెట్ అర్ధసెంచరీ సాధించాడు.

వరుణ్ వస్తూనే
అరంగేట్ర వన్డేలో వస్తూనే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తనదైన ముద్ర వేశాడు. తన రెండో ఓవర్లోనే వికెట్ పడగొట్టాడు. ఫిల్ సాల్ట్ (26)ను వెనక్కి పంపాడు. వరుణ్ బంతికి టెంప్ట్ అయిన సాల్ట్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి గాల్లోకి లేవడంతో మిడాన్ లో ఉన్న జడేజా ఒడిసిపట్టుకున్నాడు.
డకెట్ ఫిఫ్టీ
అంతకుముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ఘనంగా మొదలెట్టింది. ఓపెనర్లు డకెట్, సాల్ట్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా డకెట్ ఫోర్ల వేటలో దూసుకెళ్లాడు. షమి, హర్షిత్ రాణా, హార్దిక్ ల పేస్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 36 బంతుల్లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు.
భాగస్వామ్యం బ్రేక్
సాల్ట్, డకెట్ తొలి వికెట్ కు 10.4 ఓవర్లలోనే 81 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడంతో ఇండియా టీమ్ కు పరిస్థితి ప్రమాదకరంగా మారేలా కనిపించింది. కానీ వరుణ్ తర్వాతి బంతికే సాల్ట్ ను ఔట్ చేసి ఈ పార్ట్ నర్ షిప్ ను బ్రేక్ చేశాడు.
ఫీల్డింగ్ ఫెయిల్యూర్
ఈ మ్యాచ్ లో భారత ఫీల్డింగ్ ఎఫెక్టివ్ గా లేదు. నిజానికి సాల్ట్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గరే పెవిలియన్ చేరాల్సింది. కానీ హార్దిక్ బౌలింగ్ లో అతనిచ్చిన లడ్డూ లాంటి క్యాచ్ ను అక్షర్ చేజార్చాడు. అర్ధశతకం తర్వాత హర్షిత్ రాణా బౌలింగ్ లో డకెట్ క్యాచ్ ను శ్రేయస్ పట్టలేకపోయాడు. కష్టంగా కనిపించిన ఆ క్యాచ్ కోసం శ్రేయస్ డైవ్ చేసినా ఫలితం లేకపోయింది.
సంబంధిత కథనం