IPL Auction: ఐపీఎల్ వేలంలోకి పదమూడేళ్ల యంగ్ క్రికెటర్ - 30 లక్షల బేస్ ధరతో ఎంట్రీ!
IPL Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. ఈ వేలం పాటలో మొత్తం 574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో పదమూడేళ్ల వైభవ్ సూర్యవన్షీ ఒకరు. ఈ వేలంలో పోటీపడున్న అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ అతడే కావడం గమనార్హం.
IPL Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దాలో ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహించబోతున్నది బీసీసీఐ. ఈ వేలం కోసం 1574 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా....574 మందిని ఐపీఎల్ పాలక మండలి షార్ట్‌లిస్ట్ చేసింది. ఇందులో 366 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉండగా...208 మంది ఫారిన్స్ క్రికెటర్స్ ఉండటం గమనార్హం.ముగ్గురు క్రికెటర్లు అసోసియేట్ దేశాల నుంచి షార్ట్ లిస్ట్ అయ్యారు.
318 మంది అన్‌క్యాప్‌డ్ క్రికెటర్స్...
574 మందిలో 48 మంది ఇండియన్స్, 193 మంది ఫారిన్ క్రికెటర్స్ క్యాప్‌డ్ ప్లేయర్స్ లిస్ట్‌లో వేలంలోకి రాబోతున్నారు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ కేటగిరీలో 318 మంది ఇండియన్స్, 12 మంది విదేశీ ప్లేయర్స్ వేలంలో పోటీ పడనున్నారు.
పదమూడేళ్ల క్రికెటర్...
కాగా ఈ ఐపీఎల్ వేలంలో పదమూడేళ్ల యంగ్ క్రికెటర్ కూడా తన పేరును నమోదు చేశాడు. అన్ క్యాప్‌డ్ కేటగిరీలో 30 లక్షల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్ వేలంలోకి రాబోతున్నాడు. ఆ యంగ్ క్రికెటర్ ఎవరో కాదు వైభవ్ సూర్యవన్షీ. ఐపీఎల్ వేలంలో పోటీపడనున్న క్రికెటర్ల లిస్ట్‌లో 491 పేరుగా వైభవ్ పేరు కనిపించింది.
58 బాల్స్‌లో సెంచరీ...
ఈ ఏడాది జనవరిలో బీహార్ తరఫున రంజీ ట్రోఫీలోకి ఎంట్రీ ఇచ్చాడు వైభవ్. ఆ టైమ్‌లో అతడి వయసు పన్నెండు సంవత్సరాల 284 రోజులు కావడం గమనార్హం. 2011 మార్చి 27న వైభవ్ జన్మించాడు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా ఏతో జరిగిన మ్యాచ్‌లో 58 బాల్స్‌లోనే వైభవ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌తోనే అతడి ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఆల్ రౌండర్ అయిన వైభవ్ హాఫ్ స్పిన్ బౌలర్ కూడా. ఇప్పటివరకు ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వైభవ్ వంద రన్స్ చేశాడు. హయ్యెస్ట్ స్కోరు 41 కావడం గమనార్హం.
సౌతాఫ్రికా పేసర్...
వైభవ్‌తో పాటు ఆయూష్ మహత్రే (17 సంవత్సరాలు), సౌతాఫ్రికా పేసర్ క్వేనా మఫాకా (18 సంవత్సరాలు), సిద్ధార్థ్ (18 ఏళ్లు) ఈ ఐపీఎల్ వేలంలో తమ లక్‌ను పరీక్షించుకోబోతున్నారు.