90 బంతుల్లోనే 190 బాదిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో షేర్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ-vaibhav suryavanshi smashed 90 balls 190 runs rajasthan royals shared the video ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  90 బంతుల్లోనే 190 బాదిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో షేర్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ

90 బంతుల్లోనే 190 బాదిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో షేర్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ

Hari Prasad S HT Telugu

రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు. అతడు కేవలం 90 బంతుల్లోనే 190 రన్స్ బాదినట్లు వార్తలు వస్తున్నాయి. అతడు ఈ ఇన్నింగ్స్ లో ఓ సిక్స్ కొడుతున్న వీడియోను రాయల్స్ ఫ్రాంఛైజీ షేర్ చేసింది.

90 బంతుల్లోనే 190 బాదిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో షేర్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ (Surjeet Yadav)

పద్నాలుగేళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడు కొనసాగుతోంది. భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో ఈ పవర్‌ఫుల్ లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనింగ్ బ్యాటర్ మెరుపు బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. దూకుడైన స్ట్రోక్ ప్లేకు పేరుగాంచిన ఈ యువ లెఫ్ట్ హ్యాండర్.. ప్రేక్షకులు, సెలెక్టర్లను ఆశ్చర్యపరిచేలా సిక్సర్ల వర్షం కురిపించాడు.

వైభవ్ ధమాకా

సూర్యవంశీ ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్.. అతని విధ్వంసక ఇన్నింగ్స్ వీడియోను పంచుకుంది. అతడు సిక్స్‌లు ఎంత సింపుల్ గా కొడతాడో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ క్లిప్ వెంటనే వైరల్ అయింది. సూర్యవంశీ 90 బంతుల్లో 190 పరుగులు చేశాడని పలు మీడియా రిపోర్టులు వెల్లడించాయి. సూర్యవంశీ వెలుగులోకి రావడానికి పెద్దగా టైమ్ పట్టలేదు.

కేవలం 14 సంవత్సరాల 23 రోజుల వయసులో అతను 2025 ఏప్రిల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు. ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. మొదటి బంతికే సిక్స్ కొట్టి మరింత సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత కూడా సీజన్ మొత్తం అదే దూకుడు కొనసాగించాడు.

ఐపీఎల్లో వైభవ్ దూకుడు

ఈ సీజన్ ఐపీఎల్లో అతను గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ సూర్యవంశీని క్రికెట్ ప్రపంచంలో ఓ సంచలనంగా మార్చింది.

రాజస్థాన్ రాయల్స్‌తో తన అరంగేట్ర సీజన్‌ను అతడు అద్భుతంగా ముగించాడు. సూర్యవంశీ ఏడు మ్యాచ్‌లలో 206.55 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు సాధించాడు. ఇది సీజన్‌లో అత్యధికం. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటూ ఎంతో పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడి టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం