Usa Cricket Team: అమెరికా వరల్డ్ కప్ టీమ్‌లో పదిహేను మంది ఇండియన్ క్రికెటర్లు - వీసా టీమ్ అంటూ ఫన్నీ కామెంట్స్
Usa Cricket Team: జనవరిలో మలేషియా వేదికగా జరుగనున్న అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ కోసం అమెరికా తమ జట్టును ప్రకటించింది. అమెరికా జట్టులోని పదిహేను మంది ప్లేయర్లు భారత సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. అమెరికన్ టీమ్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తోన్నారు.
Usa Cricket Team: ఓ దేశంలో పుట్టిన క్రికెటర్లు మరో దేశం తరఫున క్రికెట్ ఆడటం అన్నది ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. భారత సంతతికి చెందిన పలువురు యంగ్ క్రికెటర్స్ అవకాశాల కోసం విదేశాలకు వలస వెళ్లి ఆయా దేశాల తరఫున క్రికెట్ ఆడుతోన్నారు. ఇలాంటి వారు టీమ్‌లో ఒకరో ఇద్దరో కనిపిస్తారు. కానీ టీమ్ మొత్తం విదేశీ క్రికెటర్లతోనే నిండిపోవడం, అది కూడా వారంతా భారత ప్లేయర్లు కావడం మాత్రం అరుదనే చెప్పుకోవాలి.
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్....
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ కోసం అమెరికా క్రికెట్ బోర్డు పదిహేను మంది సభ్యులతో టీమ్‌ను ప్రకటించింది. ఈ అమెరికా టీమ్‌లోని పదిహేను మంది ప్లేయర్లు భారత సంతతికి చెందిన వారే కావడం గమనార్హం.
ఇండియన్ ఎన్ఆర్ఐ....
అమెరికా అండర్ 19 ఉమెన్ టీమ్‌కు అనికా కోలాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ఆమెతో పాటు జట్టులోని అదితి చుదాసామా, చేతన రెడ్డి, చేతన ప్రసాద్, దిశా దింగ్రా, ఇషానీ వాగేలా, ఇషా శెట్టి, మాహీ మాధవన్, పూజ గణేష్, నిఖర్ దోషి, పూజా షా, రీతూ సింగ్, సాన్వీ ఇమ్మడి, సాష వల్లభనేని, సుహానిలను అమెరికా క్రికెట్ బోర్డు అండర్ 19 వరల్డ్ కప్ కోసం ఎంపికచేసింది. ఈ పదిహేను మంది ఇండియన్ ఎన్ఆర్ఐలే కావడం గమనార్హం. ఇందులో ముగ్గురు తెలుగు ప్లేయర్లు కూడా ఉన్నారు. అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన ప్లేయర్లు ఒక్కరూ కూడా ఈ టీమ్‌లో లేరు.
హెచ్‌వన్‌బీ వీసా స్క్వాడ్....
అమెరికా అండర్ 19 జట్టుపై నెటిజన్లతో పాటు క్రికెట్ అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తోన్నారు. హెచ్‌వన్‌బీ వీసా స్క్వాడ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తోన్నారు. ఇది ఇండియా బీ టీమ్‌లా ఉందని మరో నెటిజన్ పేర్కొన్నాడు. జనవరి 19న తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో అమెరికా టీమ్ తలపడనుంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా…
జనవరి 18 నుంచి మలేషియా వేదికగా అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగనుంది. మొత్తం పదహారు టీమ్‌లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఈ అండర్ 19 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత జట్టు బరిలోకి దిగుతోంది. ఇండియన్ టీమ్‌కు నిఖితా ప్రసాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.