USA T20 world cup squad : అమెరికా టీ20 వరల్డ్ కప్ జట్టులో.. సగం మంది భారత ప్లేయర్లే!
USA T20 world cup 2024 squad : టీ20 వరల్డ్ కప్ 2024 జట్టును ప్రకటించింది అమెరికా. ఈ యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్ జట్టులో చాలా మంది భారతీయులే ఉన్నారు!
USA T20 world cup team : ఇంకొన్ని వారాల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2024ని వెస్టిండీస్‌తో పాటు అమెరికా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. అమెరికా.. తన టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది. ఇందులో చాలా మంది భారత ప్లేయర్లు కనిపిస్తున్నారు. వీరిలో చాలా మంది రంజీతో పాటు ఐపీఎల్ కూడా ఆడిన వారున్నారు.
యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్ జట్టులో భారతీయులు..
2018-19 రంజీ ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన మాజీ దిల్లీ బ్యాటర్ మిలింద్ కుమార్.. యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. నాటి రంజీ సీజన్లో సిక్కిం తరఫున ఆడి.. 1331 రన్స్ చేశాడు మిలింద్ కుమార్. దిల్లీతో పాటు సిక్కిం, త్రిపుర తరఫున కూడా ప్రాతినిథ్యం వహించాడు. అంతేకాదు.. ఐపీఎల్లో దిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ తరఫున కూడా ఆడాడు. 7 రంజీ సీజన్లు ఆడిన అతను.. మెరుగైన అవకాశాల కోసం కొన్నేళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లిపోయాడు. 2021లో ఫిలడెల్ఫియన్స్ మైనర్ క్రికెట్ లీగ్‌తో అమెరికాలో అరంగేట్రం చేశాడు.
ఇక యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్ 2024 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన మోనిక్ పటేల్ కూడా భారతీయుడే. అతను.. గుజరాత్లో జన్మించాడు.
USA T20 world cup sqaud : ఇక ముంబై మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్మీత్ సింగ్‌కి కూడా.. అమెరికా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. ఈ 31ఏళ్ల ఆటగాడు.. 2012లో అండర్-19 వరల్డ్ కప్ ఆడాడు. 2013లో రాజస్థాన్ రాయల్స్‌కి ప్రాతినిథ్యం వహించాడు. త్రిపుర తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. 2021లో అమెరికా క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. మైనర్ లీగ్ క్రికెట్లో సియాటెల్ థండర్బోల్ట్స్కి కెప్టెన్సీ వహించాడు.
మరో ముంబై పేసర్ సౌరభ్ నేత్రావల్కర్కి కూడా యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం లభించింది. 2010 అండర్ 19 వరల్డ్ కప్ ఆడాడు సౌరభ్. కేఎల్ రాహుల్, జయదేవ్ ఉనడ్కత్, మయాంక్ అగర్వాల్‌లు ఈ అండర్ 19 వరల్డ్ కప్ జట్టు నుంచి వచ్చిన వారే.
అయితే.. 2012 అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ ఉన్ముక్ చాంద్, వికెట్ కీపర్ స్మిత్ పటేల్‌లకు.. యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులో చోటు దక్కలేదు!
USA T20 world cup sqaud 2024 : భారతీయులే కాదు.. ఇతర దేశాల నుంచి కూడా అమెరికాకు వలస వెళ్లిన వారున్నారు. వారిలో ప్రముఖంగా వినిపించే పేరు కోరి ఆండర్సన్. ఈ న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్‌కి ఇప్పుడు యూఏఎస్ టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. 2015 వరల్డ్ కప్, 2014-2016 టీ20 వరల్డ్ కప్స్‌లో న్యూజిలాండ్ తరఫున ఆడిన అతను.. 2023లో అమెరికాకు వెళ్లిపోయాడు. గత నెలలో.. ఓ టీ20 లీగ్‌లో ఆడాడు.
పాకిస్థాన్‌కు చెందిన అలి ఖాన్‌కి కూడా రాబోయే ప్రపంచ కప్‌లో చోటు దక్కింది. అతను 2010లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ఆడాడు.
టీ20 వరల్డ్ కప్‌లో.. ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్‌లు ఉన్న గ్రూప్ ఏలోనే.. యూఎస్ఏ కూడా చోటు దక్కింది.
యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్..
T20 world cup 2024 : మోనిక్ పటేల్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఆండ్రిస్ గౌస్, కోరి ఆండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సి సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీశ్ కుమార్, నోషుతోష్ కెంజిగి, సౌరభ్ నేత్రవాల్కర్, షాడ్లీ వాన్, స్టీవెన్ టేలర్, షయన్ జహంగీర్.
సంబంధిత కథనం