Gill - Sara Tendulkar: శుభ్‌మ‌న్ గిల్‌తో సారా పెళ్లి - క‌న్ఫామ్ చేసిన యూఏఈ క్రికెట‌ర్‌-uae cricketer chirag suri interesting comments on shubman gill sara tendulkar relationship ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Uae Cricketer Chirag Suri Interesting Comments On Shubman Gill Sara Tendulkar Relationship

Gill - Sara Tendulkar: శుభ్‌మ‌న్ గిల్‌తో సారా పెళ్లి - క‌న్ఫామ్ చేసిన యూఏఈ క్రికెట‌ర్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 10, 2023 11:48 AM IST

Gill - Sara Tendulkar: శుభ్‌మ‌న్ గిల్‌, సారా టెండూల్క‌ర్ పెళ్లిపై యూఏఈ క్రికెట‌ర్ చిరాగ్ సూరి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. వారిద్ద‌రి రిలేష‌న్‌షిప్‌ను అత‌డు క‌న్ఫామ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

శుభ్‌మ‌న్ గిల్‌, సారా టెండూల్క‌ర్
శుభ్‌మ‌న్ గిల్‌, సారా టెండూల్క‌ర్

Gill - Sara Tendulkar: టీమిండియా ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌, స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌య సారా టెండూల్క‌ర్ డేటింగ్ చేస్తోన్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తోన్నాయి. శుభ్‌మ‌న్ , సారా క‌లిసి దిగిన ఫొటోలు ప‌లుమార్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అలాగే శుభ్‌మ‌న్ ఆడిన మ్యాచ్‌ల‌లో సారా టెండూల్క‌ర్ క‌నిపించ‌డం కూడా ఈ పుకార్ల‌కు బ‌లాన్ని చేకూర్చింది. శుభ్‌మ‌న్ గిల్‌, సారా టెండూల్క‌ర్ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఈ పెళ్లి వార్త‌ల‌పై అటు గిల్ ఫ్యామిలీతో పాటు ఇటు స‌చిన్ ఫ్యామిలీ క‌న్ఫామ్ చేయ‌లేదు. తాజాగా గిల్‌, సారా రిలేష‌న్‌షిప్‌పై యూఏఈ క్రికెట‌ర్ చిరాగ్ సూరి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఓ ఇంట‌ర్వ్యూలో నెక్స్ట్ పెళ్లిపీట‌లు ఎక్క‌బోయే స్టార్ క్రికెట‌ర్ ఎవ‌ర‌ని అడిగిన ప్ర‌శ్న‌కు శుభ్‌మ‌న్ పేరును చెప్పాడు చిరాగ్ అలీ. శుభ్‌మ‌న్‌కు ల‌వ‌ర్ ఉంద‌ని, ఆమె పేరు సారా అని చిరాగ్ అలీ చెప్పాడు. ఆమె మ‌రెవ‌రో కాదు స‌చిన్ డాట‌ర్ అని చెప్పాడు.

సారానే శుభ్‌మ‌న్ పెళ్లిచేసుకునే అవ‌కాశం ఉంద‌ని చిరాగ్ సూరి అన్నాడు. శుభ్‌మ‌న్‌, సారా పెళ్లిపై చిరాగ్ సూరి చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. చిరాగ్ సూరి ఇంట‌ర్వ్యూ క్లిప్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. చిరాగ్ సూరి కామెంట్స్ నిజ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు.

ఇటీవ‌లే శుభ్‌మ‌న్ గిల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌డంతో ల‌వ్ సింబ‌ల్‌తో అత‌డికి కంగ్రాట్స్ చెప్పింది సారా టెండూల్క‌ర్‌. త‌మ మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌షిప్‌ను చెప్ప‌క‌నే చెప్పిందంటూ ఆమె పోస్ట్‌కు కామెంట్స్ వ‌చ్చాయి.

WhatsApp channel