Test Cricket: 2010 కంటే ముందు అరంగేట్రం - ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ ఆడుతోన్న ఐదుగురు క్రికెటర్లు వీళ్లే!
2010 కంటే ముందు టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొందరు క్రికెటర్లు ఇప్పటికీ ఆయా దేశాల టెస్ట్ జట్టుల్లో సభ్యులుగా కొనసాగుతోన్నారు. సుదీర్ఘ కాలంగా టెస్ట్ క్రికెట్ ఆడుతోన్న క్రికెటర్లు ఎవరంటే?
Test Cricket: టెస్ట్ క్రికెట్‌లో ఐదారేళ్లు కొనసాగడమే ప్రస్తుత క్రికెటర్లకు కష్టంగా మారింది. ఎడతెరిపి లేని షెడ్యూల్, గాయాల బెడద కారణంగా సుదీర్ఘ ఫార్మెట్ ఆడటానికి నేటిరతం క్రికెటర్లు చాలా మంది పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. మరోవైపు టీ20 స్పెషలిస్ట్‌లకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ టెస్ట్ క్రికెటర్లకు ఉండదు. జిడ్డు బ్యాట్స్‌మెన్స్ అంటూ టెస్ట్ క్రికెటర్లపై అభిమానులు విమర్శలు గుప్పిస్తుంటారు. అందుకే రానురాను టెస్ట్ స్పెషలిస్ట్‌లు కనిపించడమే అరుదుగా మారిపోతుంది.
2010 కంటే ముందు...
అయితే కొందరు క్రికెటర్లు మాత్రం టెస్ట్ ఫార్మెట్‌లో దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. 2010 కంటే ముందు టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వీళ్లు ఇప్పటికీ ఆయా దేశాల తరఫున సుదీర్ఘ ఫార్మెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఆ క్రికెటర్లు ఎవరంటే?
బంగ్లాదేశ్ నుంచి ఇద్దరు...
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పికర్ రహీమ్ టెస్టుల్లోకి 2005లో అరంగేట్రం చేశాడు. గత పంతొమ్మిది ఏళ్లుగా టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికీ బంగ్లాదేశ్ టెస్ట్ టీమ్‌లో కీలక ప్లేయర్‌గా ముష్ఫికర్ రహీమ్ కొనసాగుతోన్నాడు. ప్రజెంట్ జనరేషన్‌లో అత్యధిక కాలంగా టెస్ట్ క్రికెట్ ఆడుతోన్న క్రికెటర్‌గా రహీమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు 88 టెస్ట్‌లు ఆడిన రహీమ్ 5676 పరుగులు చేశాడు.
మరో బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ ఆల్ హసన్ 2007లో టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముష్ఫికర్ రహీమ్‌తో షకీబ్ కూడా ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడుతోన్నాడు. ముష్ఫికర్‌తో పోలిస్తే తక్కువ టెస్ట్‌లు ఆడాడు షకీబ్. ఇప్పటివరకు 67 టెస్ట్‌లు మాత్రమే ఆడాడు.
న్యూజిలాండ్ పేసర్
టీమ్ సౌథీ 2008 నుంచి న్యూజిలాండ్ టెస్ట్ టీమ్‌లో కొనసాగుతోన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ టెస్ట్ టీమ్‌కు టీమ్ సౌథీ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు. 2008లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టీమ్ సౌథీ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పదిహేనేళ్ల కెరీర్‌లో సరిగ్గా వంద మ్యాచ్‌లు ఆడిన టీమ్ సౌథీ 380 వికెట్లు తీశాడు.
కీమర్ రోచ్...
కీమర్ రోచ్ 2009లో వెస్టిండీస్ తరఫున టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 36 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ టెస్ట్ టీమ్‌లో మెంబర్‌గా కొనసాగుతోన్నాడు. పదిహేను ఏళ్లలో 81 టెస్ట్‌లు ఆడిన ఈ వెస్టిండీస్ పేసర్ 270 వికెట్లు తీశాడు.
109 టెస్ట్‌లు...
శ్రీలంక సీనియర్ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ ఇప్పటివరకు మొత్తం 109 టెస్టులు ఆడాడు. శ్రీలంక తరఫున అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లలో ఒకరిగా రికార్డ్ నెలకొల్పాడు. 2009లోటెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మాథ్యూస్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా శ్రీలంక టీమ్‌లో ఇప్పటికీ కొనసాగుతోన్నాడు.
టాపిక్