Tilak Varma: నాకు అదే టర్నింగ్ పాయింట్: భారత బ్యాటర్ తిలక్ వర్మ
Tilak Varma: భారత బ్యాటర్ తిలక్ వర్మ అద్భుత అర్ధ శకతంతో అదరగొట్టాడు. ఇంగ్లండ్‍తో రెండో టీ20లో టీమిండియాను గెలిపించాడు. అయితే, తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ ఏంటో తిలక్ చెప్పాడు. కెప్టెన్ సూర్యకు థ్యాంక్స్ చెప్పాడు.
భారత యంగ్ స్టార్ ప్లేయర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అద్భుత ఫామ్‍లో ఉన్నాడు. టీ20ల్లో అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ రెండో టీ20లో శనివారం (జనవరి 25) అజేయ అర్ధ శకతం చేసి టీమిండియాను గెలిపించాడు తిలక్. లక్ష్యఛేదనలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పరిస్థితి తగ్గట్టుగా ఆడి అజేయంగా 55 బంతుల్లోనే 72 పరుగులు చేసి చివరి వరకు నిలిచాడు. ఉత్కంఠ విజయం సాధించిపెట్టాడు. దక్షిణాఫ్రికాతో గతేడాది జరిగిన టీ20 సిరీస్‍లో వరుసగా రెండు సెంచరీలు చేసి దుమ్మురేపాడు తిలక్. ఇప్పుడు ఇంగ్లండ్‍తో సిరీస్‍లోనూ రాణిస్తున్నాడు. కెరీర్లో తన టర్నింగ్ పాయింట్ ఏంటో తిలక్ వర్మ చెప్పాడు.

అదే టర్నింగ్ పాయింట్
తాను ఆడిన గత నాలుగు టీ20 మ్యాచ్‍ల్లో 318 పరుగులు చేసిన తిలక్.. ఒక్కసారి కూడా ఔట్ అవలేదు. మొత్తంగా ఇప్పటి వరకు 11 అంతర్జాతీయ టీ20ల్లో 419 రన్స్ చేశాడు. ఆ రేంజ్ ఫామ్‍లో ఈ తెలుగు ఆటగాడు ఉన్నాడు. గతేడాది దక్షిణాఫ్రికాతో సిరీస్‍లో బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. తిలక్ వర్మకు ఇచ్చాడు. మూడో ప్లేస్‍లో బ్యాటింగ్‍కు దిగిన తిలక్ రెండు శతకాలతో దుమ్మురేపాడు. ఇంగ్లండ్‍తో జరిగిన రెండో టీ20లోనూ అదే ప్లేస్‍లో బ్యాటింగ్‍కు వచ్చి అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. దక్షిణాఫ్రికాలో సూర్యకుమార్ తనకు మూడో ప్లేస్ ఇవ్వడమే టర్నింగ్ పాయింట్ అని.. ఇంగ్లండ్‍తో రెండో టీ20 తర్వాత తిలక్ వర్మ చెప్పాడు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‍కు తిలక్ వర్మ థ్యాంక్స్ చెప్పాడు. “దక్షిణాఫ్రికాలో సూర్య భాయ్ నాకు మూడో పొజిషన్ ఇచ్చాడు. అదే నాకు టర్నింగ్ పాయింట్. అందుకే నేను సూర్యకు థ్యాంక్స్, అభినందనలు చెప్పాలని అనుకుంటున్నా. ఈ సిరీస్ విషయానికి వస్తే.. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ నడుస్తోంది. ఎప్పుడు అవసరమైతే నేను అప్పుడు దిగుతా. దీనికి నేను అలవాటు పడుతున్నా. నేను ఎప్పుడూ రెడీ” అని తిలక్ వర్మ చెప్పాడు.
ఇంగ్లండ్‍తో తొలి టీ20లో తిలక్ వర్మ నాలుగో ప్లేస్‍లో బ్యాటింగ్‍కు దిగాడు. సంజూ శాంసన్ ఔట్ అయి.. అభిషేక్ శర్మ ఉండటంతో రైట్, లెఫ్ట్ కాంబినేషన్ కోసం సూర్య మూడో పొజిషన్‍లో బ్యాటింగ్‍కు దిగాడు. నాలుగో ప్లేస్‍లో వచ్చిన తిలక్ నాటౌట్‍గా నిలిచాడు. చెపాక్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో ముందు అభిషేక్ ఔట్ అవగా.. బ్యాటింగ్ ఆర్డర్ మూడో ప్లేస్‍లో తిలక్ వర్మ బ్యాటింగ్‍కు బరిలోకి దిగాడు. ఐపీఎల్‍లో సూర్య, తిలక్ ఇద్దరూ ముంబై ఇండియన్స్ తరఫునే ఆడుతున్నారు. దీంతో వారిద్దరి మధ్య రిలేషన్ ఎక్కువగా కనిపిస్తుంటుంది.
అందరితో అలానే..
జట్టులో అందరితోనూ సూర్యకుమార్ యాదవ్ మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తాడని తిలక్ వర్మ చెప్పాడు. కొత్త ప్లేయయర్లతోనూ అలాగే ఉంటాడని అన్నాడు. “నేను ఓ విషయం చెప్పగలను. మేం ఇద్దరం ముంబై ఇండియన్స్ జట్టుకు కలిసి ఆడుతున్నాం. కానీ నాతోనే కాదు.. ఏ కొత్త ప్లేయర్ అయినా.. భారత జట్టులో అందరితో సూర్య మంచి బాండ్‍తో ఉంటాడు. మైదానం లోపల, బయట కూడా అలాగే ఉంటాడు. ఆటగాళ్లందరికీ సమయాన్ని ఇస్తాడు. సూర్యకుమార్ లాంటి వాడు భారత కెప్టెన్‍గా ఉండడం చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. జట్టులోకి కొత్త ప్లేయర్ వచ్చినా.. టెన్షన్‍గా ఫీల్ అవరు. సూర్య అందరితోనూ మంచి బంధం కలిగి ఉంటాడు. ఫ్రెండ్లీగా ఉంటాడు” అని తిలక్ వర్మ చెప్పాడు.
ఐదు టీ20ల సిరీస్‍లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో మ్యాచ్ జనవరి 28వ తేదీన రాజ్‍కోట్ వేదికగా జరగనుంది. ఇప్పటికే తొలి రెండు టీ20ల్లో గెలిచి 2-0తో టీమిండియా ఆధిక్యంలో ఉంది. మూడో టీ20 గెలిస్తే.. సిరీస్ భారత్ కైవసం అవుతుంది.
సంబంధిత కథనం