Rohit Sharma: వారసుడు వచ్చేశాడు - తండ్రయిన రోహిత్ శర్మ
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రయ్యాడు. రోహిత్ భార్య రితికా శనివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్, రితికా దంపతులకు క్రికెట్ వర్గాలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తండ్రయ్యాడు. రోహిత్ సతీమణి రితికా శనివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్, రితికాలకు రెండో సంతానంగా వారసుడు ఇంట్లో అడుగుపెట్టాడు. ఇప్పటికే వారికి కూతురు సమైరా ఉంది. తండ్రియిన రోహిత్ శర్మకు క్రికెట్ వర్గాలతో అభిమానులు శుభకాంక్షలు అందజేస్తున్నారు. జూనియర్ హిట్‌మ్యాన్ వచ్చేశాడు అంటూ కామెంట్స్ చేస్తోన్నారు
2015 లో పెళ్లి…
రోహిత్ శర్మకు మేనేజర్‌గా రితికా పనిచేసింది. ఆ టైమ్‌లోనే వారి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారడంతో 2015 డిసెంబర్‌లో ఇద్దరు పెళ్లిచేసుకున్నారు. 2018లో తొలి సంతానంగా సమైరా జన్మించింది.
ఆస్ట్రేలియాకు రోహిత్...
ఈ నెల 22 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భార్య డెలివరీ కారణంగా రోహిత్ శర్మ తొలి టెస్ట్‌కు దూరంగా ఉండనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సిరీస్‌కు ఎంపికైన టీమిండియా క్రికెటర్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు. కానీ రోహిత్ ఇండియాలోనే ఉండటంతో తొలి టెస్ట్ అతడు ఆడటం అనుమానమేనని అంతా అనుకున్నారు. డెలివరీ ముందుగానే జరగడం, తల్లీబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండటంతో రోహిత్ మరో రెండు, మూడు రోజుల్లో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టబోతున్నట్లు చెబుతోన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి జనవరి ఏడు వరకు మొత్తం ఐదు టెస్ట్‌లు జరుగనున్నాయి.
టీ20 క్రికెట్‌కు గుడ్‌బై ...
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత టీ20 ఫార్మెట్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం టెస్ట్, వన్డే టీమ్‌కు కెప్టెన్‌గా కొనసాగుతోన్నాడు. అతడితో పాటు మరో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా టీ20లకు వీడ్కోలు పలికాడు.
టాపిక్